Health Care

జండర్ ఈక్వాలిటీ వైపు అడుగులు.. ఏ దేశం ఏం చేస్తోందో తెలుసా?


దిశ, ఫీచర్స్ : ఇటీవల పలు సోషల్ మీడియా వేదికల్లో జండర్ ఈక్వాలిటీపై డిస్కషన్ నడుస్తోంది. నెటిజన్లు, ముఖ్యంగా స్త్రీ వాదులు, సామాజిక వేత్తలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. చాలామంది స్త్రీ, పురుషుల సమానత్వం గురించి అంగీకరిస్తున్నప్పటికీ అది ఎందుకు సాధ్యం కావడంలేదనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ప్రజెండ్ ఈక్వాలిటీని కలిగి ఉన్న దేశాలేవో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిపుణుల ప్రకారం ఇప్పటి వరకైతే ఏ దేశం కూడా పూర్తిస్థాయిలో లింగ సమానత్వాన్ని సాధించలేదు. ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రకారం..ఈక్వాలిటీ మిశ్రమంగా ఉంది. గ్లోబల్ జండర్ గ్యాప్ ఇండెక్స్ ప్రస్తుత పురోగతి రేటు ప్రకారం మహిళలు, పురుషుల మధ్య పూర్తి సమానత్వాన్ని చేరుకోవడానికి 131 సంవత్సరాలు పడుతుంది. ఈ నేపథ్యంలో ఏ దేశంలో ఎటువంటి పరిస్థితి ఉందో చూద్దాం.

కెనడా, స్లోవేనియా, నెదర్లాండ్స్

కెనడా ప్రస్తుతం గతంకంటే 0.5 శాతం పాయింట్లు లింగసమానత్వ సాధనలో మెరుగుపడింది. అలాగే ఒకే విధమైన పని, అంచనా వేసిన ఆదాయానికి తగినట్టు వేతన సమానత్వం పెరిగింది. ఇక స్లోవేనియా విషయానికి వస్తే ఈ బాల్కన్ దేశం మహిళలకు విద్య యొక్క యావరేట్ సంవత్సరాల సంఖ్య, చట్టపరమైన వివక్ష లేకపోవడం, సమాజ భద్రతకు సంబంధించిన అవగాహనలో ఉన్నత స్థానంలో ఉంది. నెదర్లాండ్స్ గురించి చెప్పుకుంటే ఈ డచ్ ప్రభుత్వం మహిళల హక్కులకు మద్దతుగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. కాకపోతే రాజకీయాల్లో మాత్రం ఇక్కడ మహిళలు చాలా తక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ దేశం కూడా విషయాన్ని గుర్తించింది.

చిలీ, ఆస్ట్రేలియా, మొజాంబిక్

చీలీ అనే దక్షిణ అమెరికా దేశం ఇటీవల లింగ సమానత్వ స్కోర్‌లను కనీసం 0.5 శాతం పాయింట్ల వరకు మెరుగు పర్చుకుంది. ఇది ప్రధానంగా శ్రామిక శక్తి భాగస్వామ్యం, నాయకత్వం, వేతనాలకు సంబంధించిన విషయాల్లో అమలవుతోంది. ఆస్ట్రేలియా విషయానికి వస్తే పసిఫిక్‌లోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంది. దురదృష్టవశాత్తు తక్కువ చెల్లింపు పరిశ్రమలలో పార్ట్‌టైమ్ కార్మికులుగా మహిళలు ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ కూడా మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంటోంది. మొజాంబిక్‌ దేశం విషయానికి వస్తే ఇది చాలా దూరం వెళ్లాల్సిందనే అంచనాలు ఉన్నాయి. అన్ని దేశాల మాదిరిగానే మహిళలపై వివక్ష, హింసను నివారించి, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. 83.3% చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌లు అమలులో ఉన్నాయి.

జమైకా, డెన్మార్క్, ఎస్టోనియా

జమైకా లింగ సమానత్వంలో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, ఆర్థిక అవకాశాలకు సమాన ప్రాప్తి ఇప్పటికీ సుదూర కల. అయినప్పటికీ కరేబియన్ ద్వీపం 2022 నుంచి అంచనా వేసిన ఆదాయంలో సమాన స్కోర్‌లను మెరుగుపరుస్తున్నది. ఇక డెన్మార్క్ విషయానికి వస్తే.. డానిష్ సంక్షేమ రాజ్యంలో జండర్ ఈక్వాలిటీ ఒక మూలస్తంభంగా ఉన్నప్పటికీ, ఇక్కడి పురుషులు ఇప్పటికీ మహిళల కంటే 12.7% ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇతర నార్డిక్ దేశాలతో పోలిస్తే, డెన్మార్క్‌లో లింగ సమానత్వం నెమ్మదిగా పురోగమిస్తోంది. ఎస్టోనియన్ మహిళలు ప్రపంచ సగటు కంటే యావరేజ్‌గా హయ్యర్ ఎడ్యుకేషన్‌ను కలిగి ఉంటున్నారు. లింగ సమానత్వం కోసం చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ ఎస్టోనియన్ రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. ఇది ఆర్టికల్ 12లో చట్టం ముందు అందరూ సమానులేనని, జండర్ పరంగా ఎవరిపైనా వివక్ష చూపకూడదని పేర్కొంది.

స్విట్జర్లాండ్, దక్షిణ ఆఫ్రికా, మోల్డోవా

అనేక దేశాలతో పోలిస్తే స్విట్జర్లాండ్ మహిళలకు ఓటు హక్కు కల్పించడంలో వెనుకబడి ఉంది. ఇది 1971లో మాత్రమే ఓటుహక్కుపై కొన్ని చర్రయలు చేపట్టింది. ఆ తర్వాత పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఈ రోజు లింగ సమానత్వం విషయానికి వస్తే, ఆల్పైన్ కంట్రీ కూడా వేతనాల పరంగా అగ్ర దేశాలలో స్థానం పొందలేదు. లింగ వ్యత్యాసం కేవలం 70% తగ్గింది. దక్షిణ ఆఫ్రికాలో లింగ సమానత్వం గమనిస్తే.. పనికి సంబంధించిన వేతనాల విషయానికి వస్తే, దక్షిణాఫ్రికా స్కోర్‌లో మెరుగుదల ఉంది. అలాగే ఆఫ్రికన్ దేశం మొత్తం లింగ వ్యత్యాసాన్ని 70% కంటే ఎక్కువగానే అధిగమించి సమానత్వం దిశగా సాగుతోంది. మోల్డోవా దేశం విషయానికి 2023లో ఈ తూర్పు యూరోపియన్ దేశంలో లింగ సమానత్వంపై పురోగతి నిలిచిపోయింది.

స్పెయిన్, అల్బేనియా

స్పెయిన్‌లో మహిళలు రాజకీయంగా చురుకుగా ఉంటున్నారు. అక్కడ మంత్రి పదవులలో మహిళల వాటా సమానంగా ఉంటుంది. 50 శాతానికి‌పైగా మహిళా మంత్రులను కలిగి ఉన్న 11 దేశాలలో స్పెయిన్ ఒకటి. నవంబరు 2023లో, అలాగే ఇటీవలే తిరిగి ఎన్నికైన ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ ప్రభుత్వం ఇక్కడి 22 ముఖ్యమైన పదవులలో 12 స్థానాలను మహిళలకే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మరో దేశం అల్బేనియా గురించి చెప్పుకుంటే పనికి తగిన వేతనాల విషయానికి వస్తే, ఇక్కడ 80% వరకు లింగ వివక్షను అధిగమించింది. పైగా 17 కేబినెట్ లెవెల్ పదవుల్లో 12 మంది ప్రధానమంత్రి ఈడి రామ ప్రభుత్వంలో మహిళలే ఉన్నారు.

ఫిలిప్పీన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, రువాండా

ఫిలిప్పీన్స్ 79.1% జండర్ ఈక్వాలిటీని సాధించింది. గత సంవత్సరం నుంచి మూడు స్థానాల్లో 0.88 శాతం పాయింట్లను మెరుగుపరుస్తుంది. 26% మహిళా క్యాబినెట్ మంత్రులతో ఫిలిప్పీన్స్ సమానత్వం దిశగా అడుగులు వేస్తోంది. ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాల విషయాలు ఫిలిప్పీన్స్‌లో సీనియర్ ఆఫీసర్ మొదలు టెక్నికల్ వర్కర్ల వరకు సమానత్వం అమలవుతోంది. ఇక యునైటెడ్ కింగ్‌డమ్ గురించి చెప్పుకుంటే జండర్ ఈక్వాలిటీలో15వ స్థానంలో ఉంది. మహిళల హక్కులకు సంబంధించి యూకేలో ఇటీవల ఆమోదించబడిన ప్రధాన చట్టాలలో ఒకటి, టాంపాన్స్‌పై టాక్స్ రద్దు చేశారు. మహిళల శానిటరీ ప్రొడక్ట్స్‌పై 0 శాతం వ్యాట్ వర్తించబడుతుందని దీని అర్థం. ఇక రువాండా విషయానికి వస్తే జండర్ ఈక్వాలిటీ అండ్ ఉమెన్స్ ఎంపవర్‌మెంట్‌లో గుర్తింపు పొందిన లీడర్. మహిళలకు ఇక్కడ అన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా 61.3% పార్లమెంట్ స్థానాల్లో మహిళలు ప్రధానపాత్ర పోషిస్తున్నారు.



Source link

Related posts

Coffee : షుగర్ లేకుండా కాఫీ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Oknews

వేసవిలో మీ పిల్లలను ఇతర చోట్లకు పంపుతున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Oknews

హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్లు నీరు ఎక్కువగా తాగకూడదా?.. నిపుణులు ఏం చెప్తున్నారంటే..

Oknews

Leave a Comment