సాంస్కృతిక పోటీల్లో ఏపీకి తృతీయ స్థానం
పీపుల్ ఛాయిస్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శకటానికి మూడో స్థానం లభించింది. ఏపీ శకటంపై ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా డిజిటల్ విద్యా బోధన, నాడు నేడు, ఇంగ్లిష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఆంగ్ల మాధ్యమంలో బోధన నేపథ్యంతో ఏపీ శకటాన్ని రూపొందించారు. ఈ నెల 26, 27 తేదీల్లో దేశ వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో వికసిత భారత్ భాగంగా రూపొందించిన ఏపీ శకటానికి మూడో స్థానం వచ్చింది. తొలి స్థానంలో గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన శకటం.. ద్వితీయ స్థానంలో యుపీ శకటం నిలిచాయి. ఇదే కాకుండా రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా జరిగిన సాంస్కృతిక పోటీలలో సైతం ఆంధ్రప్రదేశ్ కు తృతీయ స్థానం లభించింది. దీనిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ కళాకారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.