దిశ,సినిమా: శ్మశానవాటికలో నిర్మించిన ఈ ఆలయం గురించి ఇక్కడ తెలుసుకుందాం
ఈ అమ్మ వారి పేరు శ్యామ మాయాదేవి. ఈ ఆలయం బీహార్ లోని దర్భాంగా లో నిర్మించబడింది. కాళీ మాతకు అంకితం చేయడబడిన దర్భాంగ మహారాజు కోటలో ఉంది. శ్మశానవాటికలో నిర్మించిన ఈ ఆలయంలో వివాహాలు కూడా జరుగుతాయి. ఈ ఆలయం రాజ కుటుంబానికి చెందిన పూర్వికులు సమాధులు చేయబడిన శ్మశానవాటికలో నిర్మించారు. ఈ ఆలయాన్ని రామేశ్వరుడు సింగ్ కుమారుడు కామేశ్వర్ సింగ్ 1933 లో నిర్మించారు. ఆలయం నిర్మాణం మొత్తం ఎరుపు రంగులో ఉంటుంది. గర్భ గుడిలో కాళీ మాత 10 అడుగుల పొడవైన నల్ల రాయితో సృష్టించబడింది. రామేశ్వరుడు సింగ్ సమాధి పైన ఈ ఆలయం ఉంది. అమ్మ వారు ఇక్కడ నాలుగు చేతులతో అద్బుతంగా దర్శనం ఇస్తారు. ఎడమవైపున ఒక చేతిలో ఖడ్గం, మరో వైపున తల ఉంటుంది.
రెండు కుడి చేతులతో ఆశ్వీరదించి భంగిమలో అమ్మ వారు దర్శనమిస్తారు. కుడి వైపున మహాకాల్, ఎడమ వైపున గణపతి విగ్రహాలు ప్రతిష్టించిబడ్డాయి. అమ్మ వారి మేడలో ఉన్న పుర్రెల మాల హిందీ వర్ణ మాల అక్షరాలతో సమానమైనవి. హిందీ వర్ణ మాల సృష్టికి ప్రతీక కావడమే ఇందుకు కారణమని భక్తులు విశ్వసిస్తారు. ఈ విగ్రహం ప్యారిస్ నుంచి వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. విగ్రహం దగ్గర ఒక పసుపు రంగు వస్త్రం కూడా ఉంటుంది.
ఈ ఆలయంలో కాళీమాతను తాంత్రిక పూజలతో పూజిస్తారు.సాధారణంగా హిందూ ధర్మంలో వివాహం అయినా జంట ఒక ఏడాది వరకు శ్మశానవాటికకు వెళ్లరు. కానీ ఇక్కడ అంతా విచిత్రంగా ఉంది. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు ముందు శ్మశానవాటికలో ఉన్న అమ్మ వారు దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటారట.