GossipsLatest News

Mega157 Goes to Harish Shankar Hands మెగా ప్రాజెక్ట్ హరీష్ శంకర్ చేతుల్లోకి..



Thu 01st Feb 2024 10:21 AM

chiru harish shankar 157  మెగా ప్రాజెక్ట్ హరీష్ శంకర్ చేతుల్లోకి..


Mega157 Goes to Harish Shankar Hands మెగా ప్రాజెక్ట్ హరీష్ శంకర్ చేతుల్లోకి..

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది కూడా. ఈ సినిమాతో పాటు అప్పట్లో మరో సినిమా కూడా ప్రారంభం అవుతుందని, ఆ సినిమాను చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత నిర్మిస్తుందనేలా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే మధ్యలో వెంకీ కుడుమలతో అనుకున్న ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఆగిపోయింది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తన తండ్రితో సుష్మిత నిర్మించాలనుకున్న ప్రాజెక్ట్ ఏమయిందో అని అంతా అనుకుంటున్న సమయంలో.. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి టాలీవుడ్ సర్కిల్స్‌లో ఓ వార్త బయటకు వచ్చింది.

సుష్మిత సారధ్యంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్న Mega157 చిత్రం బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల్లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం హరీష్ శంకర్ మాస్ మహారాజా రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను శరవేగంగా చిత్రీకరిస్తున్న హరీష్‌కు మెగా157 బాధ్యతలను అప్పగించినట్లుగా టాక్ వినబడుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోవాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ హోల్డ్‌లో ఉన్న విషయం తెలిసిందే. పొలిటికల్‌గా పవన్ కళ్యాణ్ కాస్త ఫ్రీ అయిన తర్వాత ఓజీ, హరిహర వీరమల్లు చిత్రాలను కంప్లీట్ చేయనున్నారని, అవి రెండు పూర్తయ్యే లోపు చిరు, హరీష్‌ల ప్రాజెక్ట్ షూట్ పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారనేలా టాలీవుడ్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియదు కానీ.. నిజమైతే మాత్రం హరీష్ శంకర్ నక్క తోక తొక్కినట్లే. ఎందుకంటే, మెగాస్టార్‌ని డైరెక్ట్ చేయాలని ఆయన ఎప్పడి నుండో కలలు కంటున్నారు. ఆ విషయం చాలా సార్లు పబ్లిగ్గా చెప్పాడు కూడా. మెగా157కు బి.వి.ఎస్. రవి అదిరిపోయే కథను రెడీ చేశారని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన రానుందనేది టాక్.


Mega157 Goes to Harish Shankar Hands:

Harish Shankar To Direct Mega157









Source link

Related posts

Parties entertaining BJP! బీజేపీని ఎంటర్‌టైన్ చేస్తున్న పార్టీలు!

Oknews

Hyderabad Formula E India Race Confirmed For 2024 Season

Oknews

Top Telugu News Today From Andhra Pradesh Telangana 21 February 2024 | Top Headlines Today: వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా!

Oknews

Leave a Comment