రాయితీ వివరాలు:టూ వీలర్స్, త్రీ వీలర్స్ – 80 శాతం రాయితీ.లైట్ / హెవీ మోటర్ వెహికల్స్ పై – 50 శాతం రాయితీ.ఆర్టీసీ బస్సులపై – 90 శాతం రాయితీ.హైదరాబాద్ నగరంలోని రాచకొండ,హైదరాబాద్,సైబరాబాద్…. మూడు కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్ లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు మొదలు అన్నీ పట్టణంలో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను పాటించని వాహనదారులకు చలాన్లను విధిస్తారు.సీసీ కెమెరాల ఆధారంగా రూల్స్ అతిక్రమించిన వారి పై చర్యలు తీసుకుంటారు. తప్పనిసరిగా కొందరి నుంచి చలాన్లను వసూలు చేస్తున్న చాలా మంది మాత్రం చలాన్లను తిరిగి చెల్లించడం లేదు. ఇటీవల కాలంలో పెండింగ్ చలాన్లు పెద్ద సంఖ్యలో చెల్లించకుండా ఉండటంతో పెండింగ్ చలాన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. కొవిడ్ కారణంగా వెహికల్స్ ఓనర్స్ పెండింగ్ చలాన్లు చెల్లించపోయారు. కొన్ని వెహికల్స్ పై వాటి వ్యాల్యూ కంటే ఎక్కువ మొత్తం లో చలాన్లు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లతోపాటు తెలంగాణ వ్యాప్తంగా వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై కొద్దిరోజుల కిందట తెలంగాణ సర్కార్ రాయితీని ప్రకటించింది.
Source link