EntertainmentLatest News

ఆ పని చేసి పెడితే హనుమాన్ దర్శకుడుకి వెయ్యికోట్లు ఇస్తాను 


సంక్రాంతికి వచ్చిన హనుమాన్ ఇప్పుడప్పుడే థియేటర్స్ లో నుంచి వెళ్ళదనే విషయం పాన్ ఇండియా ప్రేక్షకులకి అర్ధమైంది. కొన్ని రోజుల క్రితం 250 కోట్ల క్లబ్ లో చేరిన హనుమాన్ తన హవాని ఏ ఫిగర్ దగ్గర ఆపుతుందో అనే విషయంపై కూడా ఎవరికీ  క్లారిటి లేదు.  ఆ శ్రీరామదూత తన  హనుమాన్  మూవీని తెరకెక్కించిన వాళ్ళని, కొన్న వాళ్ళని, చూసిన వాళ్ళని ఎంతో ఆనందంలో ముంచెత్తాడు. తాజాగా ఆ సినిమా దర్శకుడుకి ఒక అధ్బుతమైన ఆఫర్ ని ఇప్పించి తను  ఎంత శక్తిమంతుడో మరోసారి తెలియచేసాడు.

హనుమాన్ దర్శకుడైన ప్రశాంత వర్మకి సినిమాలకి సంబంధించిన ఒక భారీ ఆఫర్ వచ్చింది. ప్రాచీన భారతీయ ఇతిహాసాలకి సంబంధించిన అంశాల మీద ప్రశాంత్ వర్మని  సినిమా  చెయ్యమని ఒక ఎన్ఆర్ఐ కోరాడు. ఆ మూవీ కోసం అవసరమైతే 1000 కోట్ల  వరకైనా ఇవ్వగలనని చెప్పాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది ఎన్ఆర్ఐ తనతో ఈ విషయాన్నీ చెప్పాడని ఇటీవల ప్రశాంత్ వర్మనే స్వయంగా  చెప్పాడు.ఈ న్యూస్ విన్న చాలా మంది   ఆ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ అవ్వాలని కోరుకుంటున్నారు.ఇలాంటి సినిమాల  ద్వారా ప్రపంచానికి భారతీయత అనే పదానికి ఉన్న  గొప్పతనం గురించి తెలుస్తుందని అంటున్నారు.అలాగే  ప్రపంచదేశాలు ఇప్పుడు ఇప్పడు శాస్త్రీయంగా ఎంతో ఎదిగామని చెప్పుకునే విషయాలన్నీ కూడా  ప్రాచీన భారతదేశంలో ఎప్పుడో ఉన్నాయనే  విషయాలు అర్ధం అవుతాయని అంటున్నారు  

ఇక ప్రశాంత్ వర్మ 2018 లో నాచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేసిన  అ సినిమాతో దర్శకుడుగా అరంగ్రేటం చేసాడు. ఆ తర్వాత కల్కి, జాంబిరెడ్డి, చిత్రాలని తెరకెక్కించాడు.ఇప్పుడు హనుమాన్ తో ఒక్క సారిగా పాన్ ఇండియా ప్రేక్షకుల ఫెవరేట్ డైరెక్టర్ గా మారాడు. తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ప్రేక్షకులైతే వెయిటింగ్ లో ఉన్నారు.

 



Source link

Related posts

Feedly AI understands threat actor groups – Feedly Blog

Oknews

Eagle Overseas Public Talk ఈగల్ ఓవర్సీస్ పబ్లిక్ టాక్

Oknews

సుహాస్ 'జనక అయితే గనక' టీజర్ రిలీజ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్!

Oknews

Leave a Comment