Latest NewsTelangana

Interim Budget 2024 No Changes In Tax Rates and tax slabs Announced Check Slab details


Interim Budget 2024: 2024 మధ్యంతర బడ్జెట్‌లో వేతన జీవులకు నిరాశ తప్పలేదు. టాక్స్‌ రిబేట్‌ ‍‌(Tax Rebate) పెంచుతారేమోనని ఎదురుచూసిన వాళ్ల ఆశలపై నిర్మలమ్మ నీళ్లు చల్లారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.. దిగుమతి సుంకాలు సహా ప్రత్యక్ష & పరోక్ష పన్నుల పన్నుల రేట్లలో ఎలాంటి మార్పులు లేవని ప్రకటించారు. అంటే… 2023 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లో ఉన్న ఆదాయ పన్ను రేట్లే ఇకపైనా కొనసాగుతాయి.

బడ్జెట్‌ ప్రసంగంలో మాట్లాడిన ఫైనాన్స్‌ మినిస్టర్‌, ITR దాఖలు చేసే వారి సంఖ్య 2014 నుంచి ఇప్పటి వరకు 2.4 రెట్లు పెరిగిందని, ప్రత్యక్ష పన్ను వసూళ్లు 3 రెట్లు పెరిగాయని చెప్పారు. ITR ప్రాసెసింగ్‌ సమయాన్ని FY14లోని 93 రోజుల నుంచి ఇప్పుడు 10 రోజులకు తగ్గించామని, రిఫండ్‌లు వేగంగా జారీ చేస్తున్నామని సీతారామన్ ప్రకటించారు. 

2023 ఫిబ్రవరిలో బడ్జెట్‌ను సమర్పించిన సమయంలో‍‌, కొత్త ఆదాయపు పన్ను విషయంలో (New Income Tax Regime) కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త నిబంధనలు (Income Tax New Rules) తీసుకొచ్చింది. టాక్స్‌ రిబేట్‌ను రూ. 7 లక్షలకు పెంచింది. ఈ పన్ను విధానాన్ని డిఫాల్ట్ విధానంగా మార్చింది. ఇన్‌కమ్‌ టాక్స్‌ స్లాబ్స్‌ను కుదించి, 5కు పరిమితం చేసింది. పాత పన్ను విధానంలో (Old Income Tax Regime).. పన్ను తగ్గింపులు, మినహాయింపులకు లోబడి టాక్స్‌ శ్లాబ్స్‌ వర్తిస్తాయి. అవే రూల్స్‌, 2024-25 ఆర్థిక సంవత్సరానికి కూడా అమలవుతాయి.

కొత్త పన్ను విధానంలో అమల్లో ఉన్న ఇన్‌కమ్‌ టాక్స్‌ స్లాబ్స్‌‌ (New Income Tax Regime Slabs):

3 లక్షల వరకు ఆదాయానికి పన్ను ఉండదు.
రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల మధ్య ఆదాయంపై 5 శాతం పన్ను (సెక్షన్ 87A కింద పన్ను రాయితీ అందుబాటులో ఉంది)
రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షల మధ్య ఆదాయంపై 10 శాతం పన్ను (రూ. 7 లక్షల వరకు ఆదాయంపై సెక్షన్ 87A కింద పన్ను రాయితీ లభిస్తుంది)
రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఆదాయంపై 15 శాతం పన్ను 
రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఆదాయంపై 20 శాతం పన్ను 
15 లక్షలు మరియు అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి 30 శాతం పన్ను 

పాత పన్ను విధానంలో అమల్లో ఉన్న ఇన్‌కమ్‌ టాక్స్‌ స్లాబ్స్‌‌ (Old Income Tax Regime Slabs):

2.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు
రూ. 2.5 నుంచి రూ. 5 లక్షల మధ్య ఆదాయంపై 5 శాతం పన్ను
రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఆదాయంపై 20 శాతం పన్ను
రూ. 10 లక్షలకు పైబడిన ఆదాయంపై 30 శాతం పన్ను

పాత పన్ను విధానంలో.. 60 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు IT మినహాయింపు పరిమితి రూ. 3 లక్షల వరకు ఉంటుంది. 80 ఏళ్లు దాటిన సూపర్ సీనియర్ సిటిజన్లకు ఈ మినహాయింపు రూ. 5 లక్షల వరకు ఉంటుంది.

మరో ఆసక్తికర కథనం: బడ్జెట్‌లో కీలక పాయింట్లు – గత పద్దులో సవరణలు, ప్రస్తుత అంచనాలు ఇవే

మరిన్ని చూడండి



Source link

Related posts

No Holiday To Lic Income Tax Offices On 30 And 31 March 2024 On Saturday Sunday

Oknews

వరంగల్ ఎంజీఎంలో దివ్యాంగులకు ప్రత్యేకంగా ఓపీ సేవలు-warangal mgm special op services for disabled ,తెలంగాణ న్యూస్

Oknews

Adilabad Retired principal introduces fridge and cooler with clay which attracts people

Oknews

Leave a Comment