Andhra Pradesh

ఈ ఫిబ్రవరిలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు ఇవే-the details of the special festivals to be celebrated in the month of february in tirumala ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న స‌నాత‌న‌ ధార్మిక సదస్సుకు ముమ్మ‌రంగా ఏర్పాట్లు చేయాలని ఈవో ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తి టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో మంగ‌ళ‌వారం ఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ…. తిరుమల ఆస్థాన మండపంలో మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న స‌నాత‌న‌ ధార్మిక సదస్సులో దేశంలోని ప్రముఖ మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామిజీలు పాల్గొంటార‌న్నారు. సదస్సుకు విచ్చేసే స్వామీజీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప‌టిష్ట‌మైన ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయ‌డానికి ముగ్గురు సీనియ‌ర్ అధికారుల‌తో కూడిన స‌మ‌న్వ‌య క‌మిటీని ఏర్పాటు చేసి, వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులను సంప్ర‌దించాల‌న్నారు. అదేవిధంగా ప్ర‌తి స్వామిజీకి ఒక లైజ‌న్ అధికారిని నియ‌మించాల‌న్నారు. స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాటు చేసిన దర్శనం, వసతి, ఆహార, ర‌వాణా త‌దిత‌ర కమిటీల‌తో లైజ‌న్ అధికారి స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు.



Source link

Related posts

మూడున్నరేళ్ల తర్వాత శాసనసభకు చంద్రబాబు, నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు…-after three and a half years chandrababu to the legislative assembly ap assembly meetings from today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఏపీలో కొనసాగుతున్న వడగాల్పులు.. 76 మండలాల్లో చెలరేగిన భానుడు-hailstorm continues in ap severe heat waves broke out in 76 mandals ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

APFDC Chairman Posting: ఏపీఎఫ్‌డిసి ఛైర్మన్‌ పోస్టింగ్‌ వ్యవహారంపై అప్పుడే రగడ.. టీడీపీలో ఏం జరుగుతోందని చర్చ

Oknews

Leave a Comment