GossipsLatest News

Rashmika says Vijay will support her విజయ్ సపోర్ట్ చేస్తాడంటున్న రష్మిక



Thu 01st Feb 2024 05:36 PM

rashmika mandanna  విజయ్ సపోర్ట్ చేస్తాడంటున్న రష్మిక


Rashmika says Vijay will support her విజయ్ సపోర్ట్ చేస్తాడంటున్న రష్మిక

కొద్దిరోజులుగా విజయ్ దేవరకొండ రష్మిక వివాహం చేసుకోబోతున్నారు, రహస్యంగా డేటింగ్ చేస్తున్న విజయ్ దేవరకొండ-రష్మిక ఈ ఏడాది కచ్చితంగా పెళ్లి చేసుకుంటారనే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వగా.. విజయ్ దేవరకొండ పీఆర్ టీమ్ ఈ పెళ్లి రూమర్ ని ఖండించింది. కానీ రష్మిక మందన్న మాత్రం ఇప్పటివరకు ఈ పెళ్లి రూమర్ పై స్పందించలేదు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ తనకి బాగా సపోర్ట్ చేస్తాడని, నాకు ఏది అవసరం, ఏది మంచో, ఏది చెడో వివరిస్తాడు, అలా చెప్పడం బాగుంటుంది, అందుకే విజయ్ సలహా తీసుకుంటా అని తెలిపింది.

అంతే కాకుండా రష్మిక-విజయ్ దేవరకొండకి ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరగనుందని వచ్చిన వార్తలపై కూడా రష్మిక స్పందించింది. విజయ్‌ దేవరకొండతో తనకి ఫిబ్రవరిలో నిశ్చితార్థం, పెళ్లి జరగడం లేదని, అదంతా రూమర్ క్లారిటీ ఇచ్చింది. ప్రతీ రెండేళ్లకోసారి తనకు విజయ్ కి పెళ్లి చేయాలని కొన్ని మీడియా సంస్థలు రెడీ అవుతున్నాయని ఫన్నీగా చెప్పుకొచ్చింది. మొదట్లో ఈ రూమర్స్ విన్న ప్రతిసారి కాస్త బాధ అనిపించిన ఇప్పుడు అలవాటైపోయి ఏమి పట్టించుకోవట్లేదు అంటూ రష్మిక విజయ్ తో పెళ్లి రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. 


Rashmika says Vijay will support her:

Rashmika Mandanna Says Vijay Deverakonda Supported Me More Than Anyone









Source link

Related posts

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఓటీటీలోకి అఖిల్ 'ఏజెంట్'!

Oknews

ఎట్టకేలకు సాయి పల్లవి కామెడీ పీస్ ని కోరుకుంది    

Oknews

KA Paul Challenge BRS : సికింద్రాబాద్ పాదయాత్రతో తెలంగాణలో పాగా | ABP Desam

Oknews

Leave a Comment