Health Care

సెకండ్ హ్యాండ్‌లో ఫోన్ కొనుగోలు చేస్తున్నారా.. జాగ్రత్త


దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడకం ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక రోజు తిండి లేకపోయినా ఉంటున్నారు కానీ జనం, ఫోన్ లేకుంటే మాత్రం ఉండలేకపోతున్నారు. ఇక ఇప్పటి యూత్‌ స్మార్ట్ ఫొన్ వాడుతున్నారంటే చాలు, అదే ఓ గొప్పగా ఫీల్ అవుతుంటారు. అయితే అందరికీ డబ్బులు పెట్టి కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే స్థోమత ఉంటుందా? ఉండదు . కొందరు సెకండ్ హ్యాండ్‌లో కొనుగోలు చేస్తుంటారు.

అయితే ఇలా పాత ఫోన్ కొనుగోలు చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. పాత మొబైల్ తీసుకున్నప్పుడు అమ్మకం దారుని వద్ద imei నెంబర్ తో బిల్ తీసుకోవాలి . అసలు తాము కొనే ఫోన్ క్లిన్ గా వుందా బ్లాక్ లిస్ట్ లో ఉందా చెక్ చేసుకోవాలి.

ఎందుకంటే కొంత మంది దొంగిలించిన ఫోన్ అమ్మడమో లేక దొరికిన వాటిని తక్కువ ధరకు అమ్మడం లాంటివి చేస్తుంటారు. అందువలన కొనే ముందే ఫొన్‌ గురించి క్లారిటీగా తెలుసుకోవాలి. లేకపోతే సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుంది.

ఇక మీరు కొనే మొబైల్ ఫొన్ బ్లాక లిస్ట్‌లో ఉందో ఎలా తెలుసుకోవాలంటే? ముందుగా మొబైల్ లో *06 # ను డైలీ చేయాలి. అప్పుడు మీకు స్క్రీన్ పై imei నెంబర్ కనపడుతుంది. ఆ నెంబర్‌ను గూగుల్‌లో https://www.imei.info/ నెంబర్ ఎంటర్ చేయాలి. దీంతో మీకు ఫొన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కనిపిస్తుంది. దాని కింద ఫోన్ చెక్ ప్రో అని ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని నొక్కినా వెంటనే మీ ఫోన్ బ్లాక్ లిస్ట్ లో ఉందా లేక క్లిన్ గా ఉందొ మీకు అక్కడ సమాచారం చూపిస్తుంది.



Source link

Related posts

అందరి చూపు ఈ ట్రాన్స్‌జెండర్ పక్షి వైపే.. ఎక్కడ గుర్తించారంటే..?

Oknews

కరోనా కన్నా డేంజర్.. జపాన్ లో వ్యాపిస్తున్న మాంసాన్ని తినే బ్యాక్టీరియా

Oknews

ఈ విటమిన్ల లోపం ఉంటే నిద్రలేమి సమస్య తలెత్తుతుందని తెలుసా?

Oknews

Leave a Comment