పేదవాడి సంక్షేమంపై దుష్టచతుష్టయం దాడి
రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, ఎల్లో మీడియా, దత్తపుత్రుడే అని సీఎం జగన్ అన్నారు. ఇంతమంది తోడేళ్ల మధ్యలో జగన్ ఒంటరిగానే కనిపిస్తాడని, కానీ నిజం ఏంటంటే కోట్ల మంది హృదయాల్లో జగన్ ఉన్నాడన్నారు. వచ్చే ఎన్నికల రణక్షేత్రంలో ప్రజలే కృష్ణుడైతే నేను అర్జునుడిన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై టీడీపీ, జనసేన దండయాత్ర చేస్తుందన్నారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిందన్నారు. పేదవాడి సంక్షేమం, భవిష్యత్తుపై దుష్టచతుష్టయం దాడి చేస్తుందని మండిపడ్డారు. వైసీపీ పాలనలో అవినీతి, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించామన్నారు. వైసీపీ సంక్షేమ పాలనకు ప్రతీ పేద కుటుంబమే సాక్ష్యం అన్నారు. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు గెలవడమే తమ లక్ష్యం అన్నారు. చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు తేడా గమనించాలన్నారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ ఏ గ్రామంలోనైనా వైసీపీ పాలన మార్పులను గమనించవచ్చన్నారు. భవిష్యత్తులో పింఛన్ మరింత పెరగాలంటే వైసీపీకి అధికారం ఇవ్వాలని సీఎం జగన్ అన్నారు.