EntertainmentLatest News

తమిళ ప్రజలు నన్ను క్షమించండి


ధన్య బాలకృష్ణ..చూడ చక్కని రూపం అందమైన నటన ఆమె సొంతం.2011 లో సూర్య మురుగదాస్ కాంబోలో వచ్చిన 7 th  సెన్స్ తో సినీ రంగ ప్రవేశం చేసిన ధన్య తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో కలిపి సుమారు 35  చిత్రాలకి పైగా నటించింది. ఎనీ  లాంగ్వేజ్ లో  హీరోయిన్ ఫ్రెండ్ గా అయినా సెకండ్ హీరోయిన్ గా అయినా  ధన్య నే మేకర్స్  ముందుగా పరిగణలోకి తీసుకునే వారంటే ఆమె ఎంత ప్రధానమైన నటినో అర్ధం చేసుకోవచ్చు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసిన ధన్య ఇటీవల ప్రధాన వార్తల్లో నిలిచింది. 

 

ధన్య రీసెంట్ గా నన్ను క్షమించండి అంటూ తమిళ ప్రజలని కోరింది. రీసెంట్ గా ఆమె తమిళలో రజనీ కాంత్ లాంటి సూపర్ స్టార్ నటిస్తున్న లాల్ సలాం సినిమాలో నటిస్తుంది. అలాంటింది తను ఇప్పుడు క్షమాపణలు చెప్పవలిసి వచ్చిందంటే  ధన్య  2011 వ సంవత్సరంలో  తన ఫేస్ బుక్ అకౌంట్ లో చెన్నైకి చెందిన ప్రజలు విద్యుత్ కోసం,నీటి కోసం బెంగుళూర్  పైన ఆధారపడుతుంటారు. కానీ వాళ్ళు  బెంగళూరు ని సందర్శించే సమయంలో  చెత్తను వేస్తున్నారంటూ పోస్ట్ చేసింది.పైగా చెన్నై సూపర్ కింగ్స్ ఆ టైంలో ఐపిఎల్ లో ఫైనల్ కి చేరిన సమయంలో పోస్ట్ చేసింది.ఇప్పుడు కొంతమంది ధన్య బాలకృష్ణ  ఇటీవల ఆ మాటలని అందని ప్రచారాన్ని తీసుకొచ్చారు.దీంతో  తనని క్షమించమని ధన్య బాలకృష్ణ తమిళ ప్రజలని కోరింది. పైగా ఆ టైంలో నేను ఆ మాటలు అనలేదని  వివరణ ఇచ్చింది. 

నా టేబుల్ పై భోజనం ఉంచే నా వృత్తిపైన  ప్రమాణం చేసి చెప్తున్నాను పన్నెండు  సంవత్సరాల క్రితం కూడా నేను తమిళ ప్రజలని ఉద్దేశించి ఆ మాట అనలేదు ఎవరో కావాలనే తన మీద చేసిన కుట్ర అంటూ చెప్పింది. అయితే ఆ విషయాన్నీ నిరూపించడానికి తన దగ్గర ఆధారాలు లేవని  దీని వల్ల నేను నా  కుటుంబ సభ్యులు  చాలా బెదిరింపులకు గురయ్యాము అని కూడా ఆమె చెప్పింది.  

 



Source link

Related posts

బుట్టబొమ్మను ఆదుకుంటానంటున్న టాలీవుడ్ టాప్ స్టార్!

Oknews

One person dies of suspected dehydration at AP CM meeting సిద్ధం సభలో అపశృతి

Oknews

'మ్యాడ్' కలెక్షన్స్.. ఎంతో తెలిస్తే నిజంగానే మ్యాడ్ అయిపోతారు!

Oknews

Leave a Comment