పిల్లలను వెట్టిచాకిరికి గురి చేసినట్లయితే క్రిమినల్ కేసులుబాల కార్మికులను పనిస్థలాల నుంచి తీసుకొచ్చి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నామని, మిస్సింగ్ కేసులను ఛేదించి వారిని తల్లిదండ్రుల చెంతకు చేరుస్తూ బాధిత చిన్నారులకు బాసటగా నిలుస్తున్నామని ఎస్పీ రూపేష్ అన్నారు. బాలకార్మికులు ఎవరైనా మీ కంట పడినా, ఎక్కడైనా పనిచేస్తున్నట్లు సమాచారం ఉన్నా నేరుగా 1098 చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. 18 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలను ఎవరైనా వెట్టిచాకిరికి గురి చేసిన, బలవంతంగా బిక్షాటన చేయించిన, పశువుల కాపరులుగా, కిరాణం దుకాణాలు, మెకానిక్ షాపులు, హోటళ్లు, ఇటుక బట్టీలు, పౌల్ట్రీ ఫామ్ లు ఇతర ప్రదేశాలలోనూ పని చేయించడం, చట్టరీత్యా నేరం, ఎవరైనా పై చర్యలకు పాల్పడితే అట్టి వ్యక్తులపై చట్టరిత్య క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.
Source link
previous post