బడ్జెట్ సమావేశాలపై చర్చ…!తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 8 లేదా 10వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇవాళ్టి కేబినెట్ భేటీలో సమావేశాలపై చర్చించనున్నారు. గవర్నర్ ప్రసంగానికి కూడా ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. ఈసారికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి అందనున్న నిధుల మొత్తాన్ని బేరీజు వేసుకున్న తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు.
Source link