Latest NewsTelangana

Weather in Telangana Andhrapradesh Hyderabad on 4 February 2024 Winter updates latest news here | Weather Latest Update: 0.9 కిలో మీటర్ల ఎత్తులో ద్రోణి, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఇలా


Weather Latest News: ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.

Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో ఆగ్నేయ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.7 డిగ్రీలుగా నమోదైంది. 80 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.

Andhra Pradesh Weather: తూర్పు విదర్భ నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు మరఠ్వాడా, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 కిలో మీటర్ల ఎత్తులో సముద్ర మట్టానికి ద్రోణి తక్కువ ఎత్తులో గుర్తించామని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపోస్పిరిక్ నార్త్ ఈస్టర్/ఆగ్నేయ గాలులు వీస్తాయి.

ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు పొగమంచు ఉంటుందని చెప్పారు. ఉత్తర కోస్తాంధ్రలో కూడా వాతావరణ పొడిగా ఉండనుంది. రాయలసీమలో కూడా వాతావరణం పొడిగానే ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా పొగమంచు ఏర్పడే  అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

ఈ నెల 30న సంగారెడ్డిలో జాబ్ మేళా, పేటీఎంలో 50 ఉద్యోగాల భర్తీ!-sangareddy news in telugu paytm job mela candidates attends with certificates ,తెలంగాణ న్యూస్

Oknews

brs mlc kavitha comments in rouse avenue court in delhi | Kavtiha: ‘నన్ను ఈ కేసులో కావాలనే ఇరికించారు’

Oknews

Warangal Leaders Aruri Ramesh Resigns to BRS Pasunuri Dayakar Joins Congress Party | Aruri Ramesh Resigns to BRS: బీఆర్ఎస్‌ పార్టీకి ఆరూరి రమేష్ రాజీనామా

Oknews

Leave a Comment