Telangana

హైదరాబాద్ వాసులకు అలర్ట్, నేటి నుంచి 11వ తేదీ వరకు 23 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు-hyderabad news in telugu south central railway cancelled 23 mmts trains up to february 11th ,తెలంగాణ న్యూస్



MMTS Trains Cancelled : హైదరాబాద్ వాసులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 11 వరకు 23 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. మౌలాలి- సనత్ నగర్ స్టేషన్ల మధ్య జరుగుతున్న నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా నేటి నుంచి ఈనెల 11వరకు జంట నగరాల్లో తిరిగే 23 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో ఈ నెల 9 వరకు 3 ఎంఎంటీఎస్ రైళ్లు,10వ తేదీ వరకు మరో రెండు, 11వ తేదీ వరకు మరో 18 ఎంఎంటీఎస్(MMTS) రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మౌలాలి- అమ్మగూడ – సనత్ నగర్ స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ ఫేజ్ టు పనులు కొనసాగుతున్నాయి. అందుకే సాధారణ రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లు మొత్తం 51 రైళ్లను రద్దు చేశారు.ఈనెల 4 నుంచి 11 వరకు షెడ్యూల్ రైళ్ల రద్దు ఉంటుందన్నారు. హైదరాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్, వికారాబాద్ – గుంటూరు, రేపల్లె -సికింద్రాబాద్ తో పాటు లింగంపల్లి- హైదరాబాద్ ,లింగంపల్లి- ఉమ్దానగర్, లింగంపల్లి- ఫలక్ నామ స్టేషన్ల మధ్య షెడ్యూల్ ప్రకారం ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేశారు.



Source link

Related posts

రాజేంద్ర నగర్‌లో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్

Oknews

టీఎస్పీఎస్సీ సభ్యుల్లో స్థానికేతర వ్యక్తి, చర్చకు తెరలేపిన ప్రభుత్వ నిర్ణయం!-hyderabad news in telugu criticism on tspsc new board appointments ,తెలంగాణ న్యూస్

Oknews

Prime Minister Modi visit in Telangana for two days from today

Oknews

Leave a Comment