ByGanesh
Mon 05th Feb 2024 03:16 PM
కమెడియన్ కమ్ హీరో సుహాస్ కంటెంట్ ఉన్న కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న సుహాస్ మరోసారి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అంటూ అద్దిరిపోయే హిట్ కొట్టాడు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ చిత్రాలతో ప్రేక్షకుల మదిలో బలమైన ముద్ర వేసిన సుహాస్ ఇప్పుడు అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరితో శెభాష్ అనిపించుకున్నాడు.
మొదటి రోజు కాస్త తక్కువ ఓపెనింగ్స్ వచ్చినా.. మొదటి వీకెండ్ ని ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోవడమే కాదు బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది. ఈ వారం విడుదలైన చిత్రాలేవీ ప్రభావం చూపలేకపోవడం, అంబాజీ పేట సినిమా ప్రేక్షకులకి నచ్చడంతో రెండో రోజు నుంచి కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి. సినిమా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 4.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 2.65 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని చిన్న సినిమా పెద్ద సౌండ్ చేసింది అనేలా చేసింది.
Small movie big sound:
Ambajipeta Marriage Band collections report