ప్రతి వారంలాగే ఈ వారం కూడా థియేటర్స్ లో విడుదలయ్యే చిత్రాలతో పాటుగా ఓటిటి చిత్రాలు కూడా వరసగా విడుదల కాబోతున్నాయి. ఈ వారం థియేటర్స్ లో రవితేజ ఈగల్, డబ్బింగ్ చిత్రం లాల్ సలామ్, యాత్ర 2 థియేటర్స్ లో విడుదలవుతున్నాయి. ఇక ఓటిటి నుంచి కూడా క్రేజీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. అందులోను సంక్రాంతికి విడుదలైన చిత్రాలు ఓటిటిలోకి ఈ వారంలోనే వస్తున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన లేటెస్ట్ చిత్రం గుంటురు కారం ఈ వారంలోనే ఓటిటి ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మిగతా ఓటిటి ల నుంచి ఏయే చిత్రాలు ఈ వారం స్ట్రీమింగ్ లోకి వస్తున్నాయో చూసేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్ సిరీస్ ల లిస్ట్.
నెట్‌ఫ్లిక్స్ :
గుంటూరు కారం ఫిబ్రవరి 9
వన్ డే (హాలీవుడ్) ఫిబ్రవరి 8
భక్షక్ (హిందీ సిరీస్) ఫిబ్రవరి 9
ఆహా :
బబుల్‌గమ్ (తెలుగు) ఫిబ్రవరి 9
డిస్నీ+హాట్‌స్టార్ :
ఆర్య (హిందీ సిరీస్) ఫిబ్రవరి 9
బుక్ మై షో :
ఆక్వామెన్ (హాలీవుడ్)ఫిబ్రవరి 5
సన్‌నెక్స్ట్ :
అయలాన్ (తమిళ) ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నాయి.