Sports

Two Time Champion Hyderabad Beats Mizoram By An Innings Grabs The Plate Group Semifinals Spot


Hyderabad beats Mizoram: రంజీ ట్రోఫీ(Ranji Trophy) ప్లేట్‌ గ్రూప్‌లో అదిరే ప్రదర్శనతో హైదరాబాద్‌(Hyderabad) సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఉప్పల్‌(Uppal) వేదికగా జరిగిన గ్రూప్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ 73 పరుగుల ఆధిక్యంతో మిజోరం(Mizoram)ను చిత్తుచేసి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఆడిన అయిదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన హైదరాబాద్‌ 35 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానం నిలిచి సత్తా చాటింది. హైదరాబాద్‌ తర్వాత మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌  వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించాయి.

 

మ్యాచ్‌ సాగిందిలా…

మిజోరాంతో జరిగిన పోరులో హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ 73 పరుగుల తేడాతో గెలుపొందింది. మిజోరాం తొలి ఇన్నింగ్స్‌లో 199 పరుగులు చేయగా.. హైదరాబాద్‌ 465/9 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మిజోరాం 193 పరుగులకు ఆలౌటైంది. మన బౌలర్లలో తనయ్‌ త్యాగరాజన్‌ ఐదు వికెట్లతో సత్తాచాటాడు. బంతితో 6 వికెట్లు పడగొట్టడంతో పాటు బ్యాట్‌తో 60 పరుగులు చేసిన ఆల్‌రౌండర్‌ రోహిత్‌ రాయుడుకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. గ్రూప్‌ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన హైదరాబాద్‌ 35 పాయింట్లతో పట్టిక టాప్‌లో నిలిచింది. ఈ ఐదు మ్యాచ్‌ల్లోనూ మనవాళ్లు ఇన్నింగ్స్‌ తేడాతో విజయాలు సాధించింది.

 

ఊచకోత అంటే ఇదేనేమో…

దేశవాళి ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌(Team Hyderabad) జట్టు మరోసారి అదరగొట్టింది. ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచుల్లో విజయాలు సాధించి మంచి ఊపు మీదున్న హైదరాబాద్‌ జట్టు.. అయిదో మ్యాచ్‌లోనూ సత్తా చాటింది. అరుణాచల్‌ ప్రదేశ్‌తో ప్రారంభమైన రంజీ ట్రోఫీ ప్లేట్‌ డివిజన్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ చరిత్ర సృష్టించాడు. కేవలం 147 బంతుల్లో త్రి శతకం సాధించి దేశవాళీ క్రికెట్‌లో రికార్డు సృష్టించాడు. 147 బంతుల్లోనే 300 పరుగులు సాధించిన తన్మయ్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో అత్యంత వేగవంతమైన ట్రిపుల్‌ సెంచరీని నమోదు చేశాడు. 2017-18లో దక్షిణాఫ్రికాకు చెందిన మార్కో మరియస్‌ 191 బంతుల్లో 300 పరుగులు చేయగా… ఈ రికార్డును తన్మయ్‌ బద్దలు కొట్టాడు. న్యూజిలాండ్‌కు చెందిన కెన్ రూథర్‌ఫర్డ్‌ 234 బంతుల్లో… వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ 244 బంతుల్లో.. శ్రీలంకకు చెందిన కుశాల్‌ పెరిరా 244 బంతుల్లో త్రిశతకాలు సాధించారు. వీరందినీ అధిగమించిన తన్మయ్‌ కేవలం 147 బంతుల్లో ట్రిపుల్‌ సెంచరీ సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. 160 బంతుల్లో 33 ఫోర్లు, 21 సిక్సర్లతో 323 పరుగులు చేశాడు. 

 

రవిశాస్త్రి రికార్డు బద్దలు

తన్మయ్‌ భారత దేశవాళీ క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్‌ సెంచరీ  చేసిన ఆటగాడిగూనూ రికార్డు నెలకొల్పాడు. తన్మయ్‌ కేవలం 119 బంతుల్లో డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 39 ఏళ్ల క్రితం దేశవాళీ క్రికెట్‌లో రవిశాస్త్రి 123 బంతుల్లో డబల్‌ సెంచరీ చేయగా.. ఈ రికార్డును తన్మయ్‌ బద్దలు కొట్టాడు. తన్మయ్‌ కేవలం 119 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. రంజీ ట్రోఫీలో ఒక ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌ (14) పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును కూడా తన్మయ్‌ (21) బద్దలు కొట్టాడు.



Source link

Related posts

India Vs England 3rd Test Day 3 Rohit Falls To Root

Oknews

మేం మారిపోయాం సర్..మమ్మల్ని ఇకపై చోకర్స్ అనకండి

Oknews

Mansukh Mandaviya: కొత్త స్పోర్ట్స్ మినిస్టర్ ఈయనే.. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు మారిపోయిన మంత్రి

Oknews

Leave a Comment