EntertainmentLatest News

రామ్ చరణ్ కి జోడీగా ఎన్టీఆర్ హీరోయిన్..!


అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ లో వరుస భారీ ఆఫర్లు పట్టేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమవుతోంది జాన్వీ. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. ఇక తెలుగులో తన మొదటి సినిమా విడుదల కాకుండానే.. జాన్వీ మరో భారీ ఆఫర్ పట్టేసినట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ తన 16వ సినిమాని బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ దశలో ఉన్న ఈ స్పోర్ట్స్ డ్రామా.. ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. ‘RC 16’ లో హీరోయిన్ అంటూ జాన్వీతో పాటు సమంత, మృణాల్ ఠాకూర్, సాయి పల్లవి, రష్మిక ఇలా ఎన్నో పేర్లు వినిపించాయి. అయితే ఎట్టకేలకు జాన్వీ పేరు ఖరారైనట్లు వినికిడి.

జాన్వీ కపూర్ కి తెలుగులో మొదటి రెండు సినిమాలు ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి బిగ్ స్టార్స్ తో చేసే అవకాశం రావడం నిజంగా విశేషమనే చెప్పాలి. ఈ సినిమాలు విజయం సాధిస్తే.. జాన్వీకి స్టార్ స్టేటస్ రావడంతో పాటు ఒక్కసారిగా మరిన్ని బడా ఆఫర్లు క్యూ కడతాయి అనడంలో సందేహం లేదు.



Source link

Related posts

సాంప్రదాయని.. సుప్పినీ.. సుద్దపూసనీ!

Oknews

ఈ రోజు నందమూరి తారకరత్న జయంతి

Oknews

టిల్లు స్క్వేర్  సీక్వెల్‌ లో టిల్లు కి కరెంటు షాక్ ఇచ్చేది ఈ బ్యూటీనే!

Oknews

Leave a Comment