GossipsLatest News

పుష్ప షూటింగ్ మొత్తం అక్కడే జరుగనుందా..



Thu 08th Feb 2024 04:13 PM

pushpa 2  పుష్ప షూటింగ్ మొత్తం అక్కడే జరుగనుందా..


Will the entire shoot of Pushpa be done there? పుష్ప షూటింగ్ మొత్తం అక్కడే జరుగనుందా..

పుష్ప పార్ట్ 2 షూటింగ్ ని సుకుమార్ ఇకపై ఆఘమేఘాలపై చుట్టెయ్యడానికి రెడీ అయ్యారు. ప్రతి రోజు పుష్ప సెట్స్ లో షూటింగ్ అలిసిపోయేదాకా చేసి మరీ ఇంటికి చేరుకుంటున్నారు సుకుమార్. పుష్ప కీలక పాత్రధారి జగదీశ్ బెయిల్ పై బయటికి రావడంతో సుకుమార్ ఇకపై ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసి సినిమా విడుదల చెయ్యాలని భావిస్తున్నారట. అల్లు అర్జున్ కూడా నడుమ నొప్పి కారణం మొన్నీమధ్యనే కొద్దిరోజులు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినా.. ప్రస్తుతం సుకుమార్ తో పాటుగా రెస్ట్ లేకుండా కష్టపడుతున్నాడని తెలుస్తోంది.

ప్రస్తుతం రామోజి ఫిలిం సిటీలో పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కొద్ది రోజుల్లో రెండో యూనిట్ తో కూడా షూట్ చేయబోతున్నారని.. అంతేకాకుండా కుదిరితే మూడో యూనిట్ కూడా.. రంగంలోకి దిగుతుంది అని తెలుస్తోంది. పుష్ప 2 మొత్తం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలోనే పూర్తి చేసే ఆలోచనలో సుకుమార్ అండ్ టీమ్ ఉన్నారు అంటున్నారు. అందుకు అనుగుణంగా అవసరమైన సెట్స్ నిర్మాణం చేపట్టాలని డిసైడ్ అవుతున్నారట. 

అంతేకాకుండా.. మారేడుమిల్లి అడవులకి కి వెళ్లి అక్కడ కూడా కీలకమైన ఒకటి రెండు షెడ్యూల్స్ చిత్రీకరణ చేపడతారట. ఎట్టి పరిస్థితుల్లో ఆగష్టు 15 రిలీజ్ డేట్ మర్చకూడదన్న టార్గెట్ తో పుష్ప 2 వర్క్ జరుగుతుంది అని సమాచారం. 


Will the entire shoot of Pushpa be done there?:

Pushpa 2 shooting update









Source link

Related posts

ఆపరేషన్ వాలంటైన్  రిలీజ్ కి ముందే 50 కోట్లు దక్కించుకుందా!

Oknews

రామ్ చరణ్ కి జోడీగా ఎన్టీఆర్ హీరోయిన్..!

Oknews

Latest Gold Silver Prices Today 27 January 2024 Know Rates In Your City Telangana Hyderabad Andhra Pradesh Amaravati | Latest Gold-Silver Prices Today: గోల్డ్‌ కొనేందుకు గుడ్‌ ఛాన్స్‌

Oknews

Leave a Comment