ByGanesh
Thu 08th Feb 2024 01:16 PM
బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ రీసెంట్ గా యానిమల్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ప్యాన్ ఇండియాలో యానిమల్ సక్సెస్ అవడంతో రణబీర్ కపూర్ రేంజ్ మరింతగా పెరిగిపోయింది. అయితే ఇప్పుడు రణబీర్ కపూర్ హీరో నుంచి విలన్ కేరెక్టర్ లోకి మారుతున్నాడట. రణబీర్ కపూర్ సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం చెయ్యబోతున్నాడు. లవ్ అండ్ వార్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ చిత్రంలో రణబీర్ కపూర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ లో కనిపిస్తాడని టాక్.
ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో విక్కీ కౌశల్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని యుద్ధం నేపథ్యంలో రూపొందిస్తున్నారు. ఒక వైపు యుద్ధం మరో వైపు రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని సంజయ్ లీలా తెరకెక్కిస్తోన్నట్లుగా తెలుస్తోంది. గ్రే షేడ్ పాత్ర అవ్వడంతో.. ఈ కేరెక్టర్ లో అద్భుతమైన నటనకు స్కోప్ ఉంటుందట. అందుకే రణబీర్ కపూర్ ఈ పాత్ర చెయ్యడానికి సిద్దమైనట్లుగా తెలుస్తోంది. ఈ పాత్ర ద్వారా రణబీర్ నటుడిగా తనను తాను నిరూపించుకోవడం ఖాయం అంటున్నారు.
Ranbir Kapoor to play a grey character in Sanjay Leela Movie:
Will Ranbir Kapoor play a Negative Role in Love and War