దిశ, ఫీచర్స్ : ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) డ్రాయింగ్ టీచర్ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. టీజీటీ మొత్తం 5118 పోస్టుల భర్తీకి సెలక్షన్ బోర్డ్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు 8 మార్చి 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను అధికారిక వెబ్‌సైట్ dsssb.delhi.gov.inలో ఆన్‌లైన్ మోడ్‌లో సమర్పించాలి.
విద్యార్హత..
వివిధ సబ్జెక్టుల టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీని పొంది ఉండాలి. దరఖాస్తుదారుడి వయస్సు 32 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు.
దరఖాస్తు రుసుము..
దరఖాస్తు రుసుము రూ 100. మహిళా అభ్యర్థులు, షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగ, PWBD కి చెందిన అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించారు.
ఇలా దరఖాస్తు చేసుకోండి..
అధికారిక వెబ్‌సైట్ dsssb.delhi.gov.inకి లాగిన్ అవ్వండి.
హోమ్ పేజీలో ఇచ్చిన దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడం ప్రారంభించండి.
అన్ని వివరాలను నమోదు చేసి, ఫీజులను సమర్పించండి.
ఎంపిక ప్రక్రియ
TGT టీచర్ పోస్టులకు దరఖాస్తు దారులు టైర్ 1 పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు ఉంటుంది. పరీక్ష తేదీని ఇంకా ప్రకటించలేదు. మరింత సమాచారం కోసం మీరు నోటిఫికేషన్ ని చెక్ చేయవచ్చు.