కారణాలు తెలియదు గాని ఈ రోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన లాల్ సలామ్ కి తెలుగులో అంతగా క్రేజ్ లేకుండా పోయింది. చాలా థియేటర్స్ లో ప్రేక్షకులు లేక మార్నింగ్ షోస్ ని కూడా రద్దు చేసారు. పైగా ఈ సినిమాలో రజనీకాంత్ లాంటి సౌత్ సూపర్ స్టార్ గెస్ట్ రోల్ ని పోషించాడు. జైలర్ లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ తర్వాత రజనీ మూవీ అనే ముద్రతో వచ్చిన లాల్ సలామ్ ని ప్రేక్షకులు పట్టించుకోవడం కొంచం విచిత్రంగానే ఉంది. ఈ విషయంలో తెలుగు రజనీ ఫ్యాన్స్ కి షాకింగ్ గానే ఉన్న ఒక హీరో ట్వీట్ మాత్రం రజనీ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది.
లాల్ సలామ్ రిలీజ్ సందర్భంగా ధనుష్ తన సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేసాడు.ఆ ట్వీట్ తమిళ రజనీ అభిమానులతో పాటు తెలుగు అభిమానులని కూడా అలరిస్తుంది.అంతే కాదు వాళ్ళని ఆనందంలో కూడా ముంచెత్తుతుంది. ధనుష్ తన ట్విట్టర్ లో నేను ఈ రోజు లాల్ సలామ్ కి వెళ్తున్నాను థియేటర్ లో మూవీ చూసి ఎంజాయ్ చెయ్యబోతున్నాని చెప్పాడు. ధనుష్ ఈ ట్వీట్ వేసిన గంటలోపే మూడు లక్షలకు పైగా ఆ ట్వీట్ ని చూడటం జరిగింది. సుమారు పద్నాలుగు వేల మంది లైక్ చేసారు.అలాగే రజనీ కి ధనుష్ ఎంత పెద్ద ఫ్యానో అని కూడా అనుకుంటున్నారు. గతంలో కూడా రజనీ సినిమాకి వెళ్తున్నాని ధనుష్ తన ట్విటర్ ద్వారా వెల్లడించాడు. అలాగే రజనీ కూతురు ఐశ్వర్య తో విడాకులు తీసుకున్నా కూడా ధనుష్ అభిమానంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని కూడా అంటున్నారు.
ఇంకో వైపు ధనుష్ చేసిన ట్వీట్ మీద కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఐశ్వర్యనే లాల్ సలామ్ కి దర్శకత్వం వహించడంతో ధనుష్ పరోక్షంగా తన సపోర్ట్ ని అందించాడనే కామెంట్స్ కూడా కొంత మంది దగ్గర నుంచి వినిపిస్తున్నాయి. ఇక లాల్ సలామ్ కి తెలుగు నాట నెగిటివ్ టాక్ నడుస్తుంది