Sports

First Time In Indian Cricket Prithvi Shaw Marks Comeback With Historic Record In Ranji Trophy


Prithvi Shaw smashes century before lunch:  భారత జట్టు యువ ఓపెనర్‌ పృథ్వీ షా(Prithvi Shaw) మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. విధ్వంసకర ఆటతీరుతో మరోసారి సెలక్టర్ల తలుపు తట్టాడు. గాయంతో ఇన్నాళ్లు ఆటకు దూరమైన పృథ్వీ… వచ్చిరాగానే భారీ శతకంతో చెలరేగాడు. ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో షాకు ఇది పదమూడో సెంచరీ కావడం విశేషం. రంజీ ట్రోఫీ(Ranji Trophy 2024)లో ముంబయి తరుపున బరిలోకి దిగిన షా… ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 159 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో 18 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. గాయంతో బాధపడ్డ పృథ్వీ షా.. ఆరు నెలల తర్వాత జట్టులోకి వచ్చాడు. లండన్‌లో సర్జరీ చేయించుకున్న తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో మూడు నెలలు పాటు ఉండి ఫిట్‌నెస్‌ సాధించేందుకు కష్టపడ్డాడుయ ఆరు నెలలకు పైగా శ్రమించి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. పృథ్వీషాకు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ నిర్వహించిన జాతీయ క్రికెట్‌ అకాడమీ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో తిరిగి రంజీ ట్రోఫీలో ముంబయి టీమ్ తరపున ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆటలో 75 ఓవర్లకు ముంబయి వికెట్ నష్టానికి 280 పరుగులు చేసింది.

అప్పట్లో ఆవేదన
అండర్ – 19 వరల్డ్ కప్ గెలిచి ఆ తర్వాత  20 ఏండ్లకే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన పృథ్వీ షాను కొత్తలో వీరేంద్ర సెహ్వాగ్‌తో పోల్చారు. మరో సచిన్ అయ్యే లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయన్న వాదనలు వినిపించినా తర్వాత అతడు ఫామ్ కోల్పోయి ఇప్పుడు టీమిండియాలో ప్లేస్ కోసం నానా తంటాలు పడుతున్నాడు. వెస్టిండీస్‌తో త్వరలో జరుగబోయే వన్డే, టీ20 సిరీస్‌తో పాటు ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన టీమ్‌లో సైతం అతడికి ఛాన్స్ రాలేదు. ఈ నేపథ్యంలో పృథ్వీ షా తన కెరీర్, అవకాశాలు రాకపోవడంతో  మానసికంగా కుంగుబాటుకు లోనైన దానిపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఎందుకు తీసేశారో తెలిసేది కాదు.

క్రిక్ బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీ షా మాట్లాడుతూ… ‘నన్ను జట్టులోకి ఎంపిక కానప్పుడు అసలు సెలక్టర్లు నన్ను ఎందుకు పక్కనబెడుతున్నారో అర్థమయ్యేది కాదు. కొంతమంది నా ఫిట్నెస్ సమస్య అని చెప్పారు. కానీ నేను బెంగళూరు (ఎన్సీఏ)కు వెళ్లి అక్కడ ఫిట్నెస్ పరీక్షలన్నీ పాసయ్యాను. దేశవాళీలో  పరుగులు చేశాను. ఎట్టకేలకు టీ20 టీమ్‌లోకి తీసుకున్నా వెస్టిండీస్ సిరీస్‌లో మాత్రం మళ్లీ పక్కనబెట్టారు. ఈ నిర్ణయంతో నేను చాలా నిరాశచెందా. కానీ నేను ఈ విషయంలో ఏమీ చేయలేను.. ఎవరితోనూ పోరాడలేను..’ అని చెప్పాడు.

ఒంటరిగా బతుకుతున్నా..
జాతీయ జట్టులోకి ఎంపిక కానప్పుడు నిరాశకు గురయ్యానన్న షా.. తన క్రికెట్ జర్నీలో మెంటల్ హెల్త్‌ను కాపాడుకోవడానికి ఒంటరిగా జీవించేందుకు అలవాటుపడుతున్నానని అన్నాడు. ‘ఒక వ్యక్తిగా నేను నా సొంత స్పేస్‌లో ఉండాలనుకుంటున్నా. చాలా మంది నా గురించి చాలా విషయాలు చెబుతారు. కానీ వాళ్లను నాకు ఏం తెలుసు..? నేను ఎలా ఉంటానో ఏం తెలుసు.. నాకు స్నేహితులు లేరు. కొత్తవారిని కూడా చేసుకోవడానికి ఇష్టపడను. మన ఆలోచనలను బయటకు చెప్పుకోవాలన్న భయంగా ఉంది. ఎవరితో అయినా ఏమైనా చెప్దామనుకుంటే  దాని వల్ల ఏ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయం వేస్తోంది. నాకు అత్యంత నమ్మకస్తులని నమ్మిన స్నేహితులకు కూడా ఏదైనా విషయం చెబితే అది మరుసటి రోజు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతోంది’అని తెలిపాడు.



Source link

Related posts

IPL 2024 Schedule Indian Premier League Complete Schedule Playoffs Final Venue Announced Check Full Fixtures | IPL 2024 Schedule: ఐపీఎల్‌ పూర్తి షెడ్యూల్‌ వచ్చేసింది

Oknews

Eng Vs SA World Cup 2023 Highlights

Oknews

Non Bailable Arrest Warrant Issued Against Former India Cricketer

Oknews

Leave a Comment