Sports

Ravindra Jadejas Family Feud In The Open


Ravindra Jadeja Denies Allegations Made By His Father: టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) కుటుంబంలో విబేధాలు బయటపడ్డాయి. తన కుమారుడిని  తన కుటుంబం నుంచి కోడలు విడదీసిందని..  జడేజా తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. జడ్డూతో ప్రస్తుతం తమకెలాంటి సంబంధాలు లేవని, దీనికి అతడి భార్య రివాబా(Rivaba)నే కారణమని జడేజా తండ్రి అనిరుధ్‌సింహ్‌ ఆరోపించాడు.  పెళ్లైన తర్వాత రవీంద్ర పూర్తిగా మారిపోయాడని అతడి తండ్రి అనిరుధ్‌సిన్హా జడేజా సంచలన ఆరోపణలు చేశారు. అతడిని క్రికెటర్‌ను చేసి పెద్ద తప్పు చేశానని.. లేదంటే అందరిలాగే తమ కొడుకు కూడా తమ దగ్గరే ఉండేవాడని వాపోయారు. జడేజాను భార్య రివాబా ఏం మాయ చేసిందో కానీ, పెళ్లైన రెండు మూడు నెలలకే నెలలకే గొడవలు మొదలయ్యాయని అన్నాడు. కోడలిగా రివాబా తమ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత .. పెత్తమనమంతా ఆమెదే అయిపోయిందని , ఆమె తల్లిదండ్రులు కూడా తమ కుటుంబంలో పెత్తనం చెలాయిస్తున్నారని జడేజా తండ్రి ఆరోపించారు. రవీంద్ర, అతడి భార్య రివాబాతో తమకు ఇప్పుడు ఎలాంటి బంధుత్వం లేదని అన్నారు. 

 

ఒకే నగరంలో ఉన్నా…

మేమంతా జామ్‌నగర్‌లోనే ఉంటున్నా వారు తనను పిలవరని జడేజా తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.  రవీంద్ర పెళ్లైన తర్వాత రెండు- మూడు నెలల నుంచే మా మధ్య విభేదాలు మొదలయ్యాయని….రవీంద్ర జడేజా సొంతబంగ్లాలో విడిగా ఉంటున్నాడని తెలిపారు. ఆస్తులన్నీ జడేజా భార్య తన పేరిటే రాయించుకుందని… అంతా ఆమె సోదరులదే రాజ్యమని అన్నాడు. ప్రతి విషయంలోనూ రివాబా తల్లిదండ్రులు అతిగా జోక్యం చేసుకుంటారని తెలిపారు. వాళ్లు ఇటీవలే రూ. 2 కోట్ల విలువైన ఇంట్లోకి మారారని… అదంతా రవీంద్ర డబ్బేనని . తను నా కుమారుడు. ఇదంతా నా మనసును దహించి వేస్తోందని అనిరుధ్‌సిన్హా  ఆరోపించారు. తన కుమారుడిని క్రికెటర్‌గా తయారుచేసేందుకు ఎంతో కష్టపడ్డానని. భుజాన 20 లీటర్ల పాల క్యాన్లను మోసుకుంటూ డబ్బులు సంపాదించా. అతడి చెల్లి కూడా తల్లిలాగా సేవలందించిందని… అసలు తను క్రికెటర్‌ కాకపోయుంటే బావుండేదని అనిపిస్తుంటుందని జడేజా తండ్రి సంచలన ఆరోపణలు చేశాడు. తాను ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని. కీర్తి శేషురాలైన తన భార్య పెన్షన్‌తో బతుకున్నానని.. అన్నాడు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో జామ్‌నగర్‌ నార్త్‌ నియోజకవర్గం నుంచి రివాబా బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందింది.

 

అన్నీ కట్టుకథలే

తన భార్యపై తండ్రి అనిరుధ్‌ అనవసర ఆరోపణలు చేస్తున్నాడని, ఆమె గౌరవానికి భంగం కలిగించే చర్యలు తగవని జడేజా పేర్కొన్నాడు. పత్రికలో మా నాన్న చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని… అవన్నీ ఏకపక్ష కథనాలని అన్నాడు. తన భార్య వ్యక్తిత్వాన్ని కించపర్చడాన్ని ఏమాత్రం సహించనని…తానూ చాలా విషయాలు చెప్పగలను. కానీ వాటిని బహిరంగంగా వెల్లడించడం సరికాదని జడ్డూ తెలిపాడు. రవీంద్ర జడేజా గురించి వస్తున్న వార్తలపై అతడి అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది జడ్డూకు మద్దతుగా నిలిస్తే.. మరికొంత మంది అతడి తండ్రికి అండగా నిలుస్తున్నారు. ఏదేమైనా కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు రాజకీయాలకు అవకాశం ఇవ్వొద్దని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.



Source link

Related posts

WPL 2024 Final RCB conquer Delhi Capitals by 8 wickets clinch maiden WPL title

Oknews

పెను సంచలనం మిస్సైంది.!

Oknews

Ind Won Vizag Test By 106 Runs

Oknews

Leave a Comment