దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయంరైల్వే టికెట్ల కొనుగోలు సౌలభ్యం కోసం అన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో పీఓఎస్ మెషీన్లు,యూపీఐ ద్వారా చెల్లింపులు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే డిజిటల్ కార్యక్రమంలో ముందంజలో ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా యూటీఎస్ మొబైల్ యాప్, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్, పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లు,యూపీఐ చెల్లింపులు మొదలైన వాటిని ప్రవేశ పెట్టడం వంటి అనేక చర్యలు చేపట్టింది దక్షిణ మధ్య రైల్వే. ఆన్లైన్ సదుపాయాలను బలోపేతం చేయడానికి రైలు వినియోగదారులు సులభంగా,సౌకర్యవంతంగా టికెట్లు కొనుగోలు చేయడానికి, నగదు రహిత లావాదేవీల డిజిటల్ చెల్లింపులను మరింతగా ప్రోత్సహించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. దీని ప్రకారం…. దాదాపు జోన్ లోని అన్ని ముఖ్యమైన నాన్ సబర్బన్ స్టేషన్లలో, సబర్బన్ కేటగిరి స్టేషన్ లోని అన్ని ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం, ఆన్ రిజర్వడ్ టికెటింగ్ సిస్టమ్ కౌంటర్లలో పోఓయేస్ మెషీన్ ల చెల్లింపులకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. సాంకేతిక అభివృద్ధి చెందుతున్నందున నగదు రహిత చెల్లింపులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. దీని ప్రకారం రైలు ప్రయాణికులకు అనుగుణంగా సేవ చేయడానికి దక్షిణ మధ్య రైల్వే సానుకూల ప్రయత్నాలు చేస్తుంది. దక్షిణ మధ్య రైల్వే లో ఈ ప్రయత్నాలు భాగంగా ప్రస్తుతం 466 పీఓఎస్ యంత్రాలు అందుబాటులోకి తెచ్చింది. ఈపీఓఎస్ మిషన్ లో డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులను సులభతరం చేస్తాయి. తద్వారా సులభతరమైన సౌకర్యంతమైన లావాదేవులను అందిస్తాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు.
Source link