Rats Bite Patient in ICU in Kamareddy: కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు హల్చల్ చేశాయి. ఆస్పత్రిలోని ఐసీయూలో (ICU) చికిత్స పొందుతున్న రోగిని కరిచాయి. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన షేక్ ముజీబ్ అనే వ్యక్తి అనారోగ్యానికి గురై ప్రభుత్వాసుపత్రిలో చేరి గత వారం రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఎలుకలు రోగి కాళ్లు, చేతులపై కరవగా తీవ్ర రక్త స్రావం అయ్యింది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వైద్యులకు సమాచారం అందించగా వారు చికిత్స అందించారు. ఐసీయూలోని పీఓపీ భాగం దెబ్బతినడంతో ఆ రంధ్రం గుండా ఎలుకలు సంచరిస్తున్నాయని రోగి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అటు, రోగిపై ఎలుకల దాడితో ఆస్పత్రిలోని ఇతర రోగులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఆస్పత్రి సిబ్బంది ఎలుకల సంచారం లేకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Also Read: Hyderabad News: షాకింగ్ – చాక్లెట్ లో బతికున్న పురుగు దర్శనం, ఎక్కడంటే?
మరిన్ని చూడండి