ఈ సంక్రాంతికి ‘గుంటూరు కారం’తో ప్రేక్షకులను పలకరించిన మహేష్ బాబు.. తన తదుపరి సినిమాని ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఇండియానా జోన్స్ తరహాలో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ దశలో ఉన్న ఈ మూవీ కోసం ప్రస్తుతం మహేష్ మేకోవర్ అయ్యే పనిలో ఉన్నాడు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని మహేష్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబధించి ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది.
మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ నటించే అవకాశం ఉందని పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లాన్ ని రాజమౌళి రంగంలోకి దింపుతున్నట్లు కూడా న్యూస్ వినిపించింది. ఇప్పుడు ఆ న్యూస్ నిజమని తెలుస్తోంది. ‘SSMB 29’లో చెల్సియా నటించడం ఫిక్స్ అయిందని సమాచారం. అంతేకాదు తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో రాజమౌళిని చెల్సియా ఫాలో అవ్వడం ఆ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. త్వరలో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించి ఈ సినిమాకి సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారట.