హిందువులు, లింగాయత్ ల ఓట్ల పై ఆశలుసంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో జహీరాబాద్, ఆందోల్, నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లాలో ఉండగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలు కామారెడ్డి జిల్లాలో ఉన్నాయి. ఈసారి లోక్ సభ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో, ఈసారి బీజేపీ ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే గెలిచింది. ఇక్కడ లింగాయత్ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటంతో, అయోధ్య మందిరం ప్రాణప్రతిష్ట నేపథ్యంలో హిందువుల ఓట్లపై కూడా ఆశలు పెట్టుకుంది బీజేపీ. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇన్ ఛార్జ్ గా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డిని పార్టీ నియమించింది. అలాగే సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా గోదావరి అంజి రెడ్డిని నిమయమించి పార్టీలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇక అప్పటి నుంచి వెంకటరమణ రెడ్డి పార్లమెంట్ సెగ్మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలను కలుస్తూ సమన్వయం చేయడానికి యత్నిస్తున్నారు.
Source link