Latest NewsTelangana

TSPSC ready to release Group 1 Notification Soon


TSPSC Group 1 Notification: తెలంగాణ వచ్చి పదేళ్లు కావొస్తున్నా ఇప్పటివరకూ ఒక్కసారి కూడా గ్రూప్–1 పోస్టులను గత ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఈ క్రమంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ పై కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో టీఎస్‌పీఎస్సీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకుంది. గ్రూప్ 1 పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని గత ఏడాది హైకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ టీఎస్‌పీఎస్సీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కానీ ప్రస్తుతం మారిన పరిస్థితులతో కొత్తగా ఏర్పాటైన చైర్మన్, సభ్యులు గ్రూప్ 1పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు మరో వ్యాజ్యం సుప్రీంలో దాఖలు చేసినట్లు సమాచారం. దాంతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి.

గ్రూప్-1 పోస్టులు పెంచిన సర్కార్ 
తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గుడ్ న్యూస్ తెలిపింది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి కీల‌క నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విడుదల చేసిన 503 గ్రూప్-1 నోటిఫికేషన్‌కు అదనంగా మ‌రో 60 పోస్టులను భ‌ర్తీ చేసేందుకు అనుమ‌తి ఇచ్చింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 563కి చేరినట్లయింది. ఈ పోస్టుల భర్తీకి అనుబంధ నోటిఫికేషన్ వెలువడనుంది. గ‌తంలో 503 పోస్టుల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ పోస్టుల‌కు అద‌నంగా ఈ 60 పోస్టుల‌ను క‌లుపుతూ వీలైనంత త్వర‌గా నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గానూ గ‌తేడాది జూన్‌ 11న టీఎస్‌పీఎస్సీ ప్రిలిమ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు ఈ ప‌రీక్షను ర‌ద్దు చేసింది. ఈ పరీక్ష కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తాజాగా కొత్త‌గా 60 పోస్టుల‌ను మంజూరు చేయ‌డంతో గ్రూప్‌-1 ప్రిలిమిన‌రీ మ‌ళ్లీ నిర్వహించే అవ‌కాశం ఉంది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత  తొలిసారిగా రెండేళ్ల కింద అక్టోబరు 16న తొలిసారి ప్రిలిమ్స్‌ నిర్వహించారు. తరువాత ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్‌ ఆ పరీక్షను రద్దు చేసింది. తరువాత మళ్లీ గత ఏడాది జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించింది. టీఎస్‌పీఎస్సీ వీరి నుంచి 1:50 నిష్పత్తిలో 25 వేల మందిని ఈ ఏడాది జనవరిలో మెయిన్స్‌కు ఎంపిక చేసింది. జూన్‌లో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూలు వెలువరించింది. అనూహ్యంగా ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్‌ ఆ పరీక్షను రద్దు చేసింది. తిరిగి జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించగా 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షను కూడా కోర్టు రద్దు చేసింది. అయితే ఈ తీర్పుపై టీఎస్‌పీఎస్సీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

అది విచారణకు రాక ముందే ఆ పిటిషన్ ఉపసంహరించుకుంటున్నామని కమిషన్ కొత్త వ్యాజ్యం దాఖలు చేసింది. దీంతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల, ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయింది. గ్రూప్ 1 ఉద్యోగాలకు 46 ఏళ్ల వరకు దరఖాస్తు చేసుకునే విధంగా వయో పరిమితి సడలింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తామని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

Fans are waiting for the arrival of the successor వారసుడి రాక కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

Oknews

‘రైతుబంధు’ రాలేదా..? ఈ తేదీలోపు మీ ఖాతాల్లో జమ కానున్న డబ్బులు! తాజా అప్డేట్ ఇదే-latest key update about the deposit of rythubandhu scheme funds to farmers ,తెలంగాణ న్యూస్

Oknews

BRS Balka Suman : సీఎం రేవంత్ పై కామెంట్స్

Oknews

Leave a Comment