ByGanesh
Mon 12th Feb 2024 08:57 AM
మేటర్ వీక్‌గా ఉన్నప్పుడే ప్రచారం పీక్స్‌లో ఉంటుందని సినిమాల విషయంలో చెబుతుంటారు. ఇది రాజకీయాలకూ వర్తిస్తుంది. సినిమాలు నటీనటులకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టడం సర్వసాధారణం. అలాగే సినిమాల్లోని వారు రాజకీయ ఆరంగేట్రం చేసి సక్సెస్ అయిన సందర్భాలు కోకొల్లలు. సీఎంలుగా అయిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ రాజకీయాల్లోని వారికి సినిమాలు హైప్‌ని ఇస్తాయనుకోవడం భ్రమ. ఎందుకంటే రాజకీయ నేతల జీవితం తెరిచిన పుస్తకం. వారు కదిలినా.. మెదిలినా బయటకు తెలిసిపోతుంది. కాబట్టి సినిమాలు తీయించుకుని తమను ఇంద్రుడిగానో.. చంద్రుడిగానో చూపించుకోవాలనుకుంటే కుదరదు.
జనోద్ధారకుడిలా చూపించుకుంటే ఎలా?
ఇప్పటి వరకూ వచ్చిన బయోపిక్స్‌లో మంచి హిట్ అయ్యిందంటే మహానటి. ఆమె కథలో బయటకు రాని ట్విస్టులు ఎన్నో ఉన్నాయి. కానీ రాజకీయ నాయకుడి జీవితంలో ఏముంటాయి? ఇక అన్ని దార్లూ మూసుకుపోయినప్పుడు.. పొలిటికల్ గ్రాఫ్ పాతాళానికి పడిపోతున్నప్పుడు తన గురించి సినిమా తీయించుకుని తానొక జనోద్ధారకుడిలా చూపించుకుంటే ఎలా? తనేంటనేది జనాలకు తెలియదా? ఇక్కడే కదా.. ఫెయిల్యూర్ స్టార్ట్ అయ్యేది. ఎన్నికలకు ముందు పెయిడ్ బయోపిక్స్‌గా ఇవి విడుదలైనా ఫలితం శూన్యం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన బయోపిక్స్ అన్నీ ఈ కోవకు చెందినవే. ఎన్నికల కోసం ఏదో మ్యాజిక్ చేయాలనుకుని యాత్ర, యాత్ర 2, వ్యూహం అంటూ ఏవేవో సినిమాలు తీయించి జనాల పైకి వదులుతున్నారు.
అది ఉత్త భ్రమే..
లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇక పీక్స్. లక్ష్మీపార్వతిని దేవత మాదిరిగా చూపించారు ఈ సినిమాలో. కానీ ఆమె ఏంటనేది జనాలందరికీ తెలుసు. రాజకీయాలతో జనాలను మెప్పించలేక.. సినిమాలతో మెప్పించాలనుకోవడమే తొలి తప్పిదం. తెరిచిన పుస్తకం లాంటి జీవితానికి రంగులద్ది మసి పూసి మారేడు కాయ చేయాలనుకోవడం భ్రమే అవుతుంది. ఇలా సినిమాలు చూసి పార్టీలను జనం గెలిపించేలా అయితే రాజకీయ పార్టీలన్నీ తలొక పార్టీ తీసి వదులుతాయి కదా. పాదయాత్రలు, సభలు, సమావేశాలంటూ ఈ బాధలన్నీ ఎందుకు? చంద్రబాబు తీయదలిస్తే ఆయనకున్న సీనియారిటీకి ఎన్ని సినిమాలు తీయవచ్చు. పవన్ కల్యాణ్ ఉన్నారు.. స్వతహాగానే ఆయన స్టార్ హీరో. ఎలా సినిమా చేస్తే జనాలకు కనెక్ట్ అవుతుందో బాగా తెలుసు. వారికున్న ఎక్స్‌పీరియన్స్‌తో జనాలను సినిమాలతో హిప్నటైజ్ చేయలేరా? అవన్నీ కుదరవ్ జగనన్నా.. కాస్త కొత్తగా ట్రై చెయ్ వర్కవుట్ అవుతుందేమో..
Lakshmi NTR peaks:
Yatra 2 movie result