Health Care

వాలెంటైన్స్ డే ప్రేమికులే జరుపుకోవాలా? డిఫినేషన్ మారింది గురూ..


దిశ, ఫీచర్స్ : వాలెంటైన్స్ డే అంటే చాలామంది కేవలం స్త్రీ, పురుషుల మధ్య ప్రేమను వ్యక్త పర్చుకునే రోజుగానే పరిగణిస్తుంటారు. కొందరు ప్రేమించుకోవడం నేరంగానూ చూస్తుంటారు. అయితే శృంగారంతో సంబంధంలేని మానవ సంబంధాలను పెంపొందించే వేడుకగా ఇది ఎందుకు ఉండకూడదు? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో మాదిరి ఇప్పుడు ఫిబ్రవరి 14 అంటే.. రొమాంటిక్ డే గానో, ఓన్లీ కపుల్స్ మాత్రమే జరుపుకునే వేడుకగానో చూడాల్సిన అవసరం లేదు. దీనికి క్రమంగా డెఫినేషన్ మారుతోందని నిపుణులు చెప్తున్నారు. ప్రేమికులు, పెళ్లయిన జంటలు మాత్రమే కాదు, ఎవరైనా ఆనందాలను పంచుకోవడానికి తమదైన పద్ధతిలో సెలబ్రేట్ చేసుకోవచ్చునట. ముఖ్యంగా సింగిల్స్ ఎలా జరుపుకోవాలో నిపుణులు సూచిస్తున్నారు.

సింగిల్స్ కూడా జరుపుకోవచ్చు 

ప్రేమికుల రోజు ప్రేమికులకే కాదు, నిస్వార్థమైన ప్రేమను, ఆనందాన్ని నలుగురితో పంచుకోవడానికి ఇదొక వేదిగా మారుతోంది. ఇందులో రొమాంటిక్ యాంగిల్ మాత్రమే చూడాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. అలాగని స్త్రీ, పురుషులు ప్రేమను వ్యక్తం పరుచుకోవడాన్ని, సెలబ్రేట్ చేసుకోవడాన్ని కూడా సామాజిక వేత్తలు తప్పు పట్టడం లేదు. అయితే సింగిల్స్ తాము ఒంటరిగా ఉన్నామని బాధ పడాల్సిన అవసరం లేదు. పార్టనర్ లేకుండా ఉండటం కూడా జీవితంలో ఒక భాగమే. యుక్త వయస్సుకు రాగానే తప్పకుండా గాళ్ ఫ్రెండో లేదా బాయ్ ఫ్రెండో ఉండాలనే రూల్ ఏం లేదు. ప్రతి ఒక్కరూ ప్రేమించుకోవాలని కూడా లేదు. ఒంటరి వ్యక్తులు ఎంతోమంది ఉంటారని మర్చిపోకండి. కాబట్టి మీ స్నేహితులతో కలిసి స్నేహానికి చిహ్నంగా కూడా దీనిని సెలబ్రేట్ చేసుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. కలిసి పార్టీ చేసుకోవడమో, సినిమాలకు వెళ్లడమో, అందర్నీ మోటివేట్ చేసే సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడమో చేయవచ్చు. ఒంటరి వాళ్లంతా కలిసి సోషల్ యాక్టివిటీస్‌లో పాల్గొనవచ్చు. అభిప్రాయాలను పంచుకోవడానికి సింగిల్స్‌కు కూడా అనేక వేదికలు ఉంటాయి.

వ్యక్తిగత విషయాలపై ఫోకస్

ఒంటరి వ్యక్తులు ప్రేమికులరోజున తమకంటూ ప్రత్యేకంగా ఉండటానికి స్నేహితులతో కలిసి షాపింగ్ చేయవచ్చు. నచ్చిన హోటల్‌కు వెళ్లి ఇష్టమైన భోజనం చేయవచ్చు. అందరూ కలిసి సరదాగా మాట్లాడుకోవచ్చు. కలిసి ఫోటోలు దిగడం, గేమ్స్ ఆడటం, చేయవచ్చు. అంతే కాదు ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లో ఒంటరిగా ఉండి కూడా మీరు ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. మీ అందం, ఆహార్యంపై దృష్టి పెట్టండి లేదా మీకు ఇస్టమైన దుస్తులు కొనడానికి, ఫేషియల్ చేసుకోవడానికి, హెయిర్‌కట్‌ చేయించుకోవడానికి స్పెండ్ చేయండి. దీనివల్ల మీ మనసులో అందమైన అనుభూతి కలుగుతుంది.

ఇతరులకు హెల్ప్ చేయండి

సింగిల్స్ కదా వాలెంటైన్స్ డే రోజు బయటకు ఏం వెళ్తాం? అనే ఫీలింగ్ అవసరం లేదు. గర్వంగా వెళ్లండి. మీకు నచ్చిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను ఎంచుకొని పాల్గొనండి అంటున్నారు సామాజిక వేత్తలు అంటున్నారు. కాబట్టి ఫిబ్రవరి 14న మీరు ఏ అనాథ ఆశ్రమానికో, వృద్ధాశ్రమానికో వెళ్లి అక్కడ గడపవచ్చు. వివిధ పనులలో వారికి సాయం చేయవచ్చు. అక్కడుంటే వ్యక్తులతో మాట్లాడటంవల్ల మీలో ఏవైనా కొత్త ఆలోచనలు రావచ్చు. ఈ సమాజానికి ఉపయోగపడే విషయాలపై చర్చించవచ్చు.

ఆందోళనకర ఆలోచనలకు చెక్

ఒంటరితనం శాపం కాదు. సమస్య అంతకంటే కాదు, అదొక అవకాశం కూడా. కాబట్టి సింగిల్స్‌ ఆందోళన చెందకూడదు. వాలెంటైన్స్ డే రోజు ఇబ్బంది పెట్టే ఆలోచనలు మిమ్మల్ని వెంటాడుతుంటే డైవర్ట్ చేయండి. అందుకోసం మీరు ఉండే ఇల్లు, హాస్టల్ రూమ్ సర్దుకోవచ్చు. నచ్చినట్లు డెకరేట్ చేసుకోవచ్చు. ఆహ్లాదకరమైన వెదర్ క్రియేట్ చేసుకోవచ్చు. అవసరమైనే మీరే స్వయంగా మార్కెట్‌కు డెకరేషన్ సామగ్రిని తిచ్చి మీరున్న ఇంటిని, గదిని అలంకరించుకోండి. నచ్చిన విధంగా రెడీ అయి అద్దంలో చూసుకుని మురిసిపోండి. ఫ్యామిలీ మెంబర్స్ మెచ్చుకునే పనులు ఏవైనా ఉంటే చేయండి. ఇష్టమైన వంట చేసుకొని తినడం, నచ్చిన పుస్తకాలు చదవడం, పెండింగ్‌ వర్క్ పూర్తి చేయడం, మొక్కలు నాటడం, మ్యూజిక్ వినడం ఇవన్నీ ఫిబ్రవరి 14న ఒంటరి వ్యక్తులను సంతోషంగా ఉంచగలిగే విషయాలే.



Source link

Related posts

ఆసియాలోని అత్యుత్తమ రెస్టారెంట్ల జాబితాలో 3 భారతీయ హోటళ్లు..

Oknews

ఏప్రిల్ 1ని ఫూల్స్ డే గా ఎందుకు జరుపుకుంటారు..? దీని వెనుక కారణం ఏంటో తెలుసా..

Oknews

చరిత్రలోనే మొదటిసారి.. బతికి ఉన్న మనిషికి పంది కిడ్నీ మార్పిడి

Oknews

Leave a Comment