నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిఈ క్రమంలోనే కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన కృష్ణమూర్తికి దుండిగల్ మున్సిపల్ పరిధి దొమ్మరపోచారం పల్లిలో సర్వే నెంబర్ 320, 322 నుంచి 329, 348 సర్వే నెంబర్ లలో సుమారు 300 చదరపు గజాల స్థలం ఉంది. ఇటీవలే ఆరుగురు వ్యక్తులు డిపోచంపల్లిలో మందు పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో ఖాళీగా పడి ఉన్న కృష్ణమూర్తి ప్లాట్ పై వీరి కన్ను పడింది. అనుకున్నదే తడవుగా సదరు స్థలానికి జీపీఏ హోల్డర్ గా ఉన్న అల్లూరి సుబ్బరాజు సంతకాన్ని నిందితులు ఫోర్జరీ చేసి జీపీఏ హోల్డర్ గా చౌదరి సతీష్ బాబుని పేర్కొంటూ…నకిలీ డాక్యుమెంటులతో ఆ 300 చదరపు గజాల స్థలాన్ని సయ్యద్ ముజిబల్లా ఖాద్రీకి విక్రయించినట్లుగా నకిలీ పత్రాలను సష్టించారు. దీనిపై సమాచారం అందుకున్న బెంగళూరుకు చెందిన ప్లాటు ఓనర్ కృష్ణమూర్తి దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు…..నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ వెంకట్ రెడ్డి, సీఐ శంకరయ్య, ఎస్ఐ రాజేష్ సిబ్బందిని డీసీపీ నేతకు పంత్ అభినందించారు.
Source link