Entertainment

షూటింగ్ జరుపుకుంటున్న నాగార్జున మూవీ ఇక నుంచి వీళ్లదే..మాస్ కా బాప్ అంటున్న ఫ్యాన్స్


కింగ్ నాగార్జున చాలా సంవత్సరాల తర్వాత నా సామిరంగ తో తన రేంజ్ కి తగ్గ హిట్ ని కొట్టాడు. హిట్ కొట్టడమే కాదు తన అభిమానుల్లో జోష్ ని కూడా తెచ్చాడు. దీంతో మా నాగ్ హిట్ కొడితే బాక్స్ ఆఫీస్ సుర్రు సుమ్మయిపోవాల్సిందే అనే  మాటలు అభిమానుల నోటి నుండి  వినిపిస్తున్నాయి. తాజాగా నాగార్జునకి సంబంధించిన  న్యూస్ ఒకటి  ఇక తెలుగు సినిమా పరిశ్రమలో  నాగ్ టైం షురు అనుకునేలా చేస్తుంది.  

నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల మూవీని చేస్తున్నాడు. ఇప్పుడు ఈ  మూవీ ఓవర్సీస్ రైట్స్ ని ప్రముఖ ప్రతిష్టాత్మక  సంస్థ  డ్రీమ్జ్ ఎంటర్ టైన్మెంట్ సొంతం చేసుకుంది. అత్యంత భారీ రేటుకి  సదరు సంస్థ ఓవర్ సీస్ హక్కులని  సొంతం చేసుకుంది.ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు నాగ్ అభిమానుల్లో ఆనందాన్ని తీసుకొచ్చాయి. వింటేజ్ డేస్ లో  నాగార్జున ఎలా అయితే మాస్ క్యారెక్టర్స్ చేసి తమని రంజింప చేసాడో మళ్ళీ అదే బాటలో సినిమాలు చెయ్యాలని ఫ్యాన్స్  ఉవ్విళ్లూరుతున్నారు. నాగార్జున అంటేనే మాస్ కా బాప్ అనే విషయాన్నీ సిల్వర్ స్క్రీన్ కి  గుర్తుచెయ్యలని కూడా అనుకుంటున్నారు.

 

ఇంకా టైటిల్ నిర్ణయించని ఆ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి  అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. నాగార్జున తో పాటు తమిళ అగ్ర నటుడు ధనుష్ కూడా మరో హీరోగా చేస్తున్నాడు.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో DNS అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ  షూటింగ్ ఇటీవల  ముంబై  తిరుపతిలో జరిగింది.నాగార్జున డాన్ గా కనిపించబోతున్నాడనే టాక్ అయితే ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

 



Source link

Related posts

రాజ్ తరుణ్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన కరాటే కళ్యాణి 

Oknews

my mom come to know about my love story in my tenth class

Oknews

రష్మికకి తప్పిన విమాన ప్రమాదం.. సౌందర్య విషయాన్ని గుర్తుచేసుకుంటున్న జనం

Oknews

Leave a Comment