మూడున్నర దశాబ్దాల పై నుంచి తెలుగు సినిమాతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులని మరీ ముఖ్యంగా తన అభిమానులని అలరిస్తు వస్తున్న నటుడు చిరంజీవి. ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ లో ఎంత ఉత్తేజం ఉంటుందో ఆ సినిమా షూటింగ్ ని జరుపుంటున్నపుడు కూడా ఫ్యాన్స్ లో అంతే ఉత్తేజం ఉంటుంది.తాజాగా ఆయన మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి అభిమానుల్లో ఆనందాన్ని నింపుతుంది.
మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న నయా మూవీ విశ్వంభర. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆ మూవీకి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుంటుంది.కొన్ని రోజుల క్రితం చిరంజీవి
షూటింగ్ లోకి ఎంటర్ అయ్యాడు.ఇప్పుడు ఆ షెడ్యూల్ నిర్విరామంగా కంప్లీట్ చేసుకుంది.అత్యంత భారీ సెట్టింగ్స్ నడుమ విశ్వంభర కి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలని మేకర్స్ చిత్రీకరించారు. అలాగే పోరాట సన్నివేశాలని కూడా ఈ షెడ్యూల్ లో తెరకెక్కించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ పోరాట సన్నివేశాలు ఒక లెవల్లో ఉన్నాయని రేపు థియేటర్స్ లో ఫ్యాన్స్ కి పూనకాలు రావడం గ్యారంటీ అనే మాటలు వినిపిస్తున్నాయి.
భోళా శంకర్ పరాజయంతో మెగా అభిమానులు విశ్వంభర కోసం వెయిట్ చేస్తున్నారు.జనవరి 10 2025 సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వబోతున్న విశ్వంభర లో చిరు సరసన ఒక హీరోయిన్ గా త్రిష చేస్తుంది. ఇంకో ఇద్దరు హీరోయిన్ లకి చిరు పక్కన ఛాన్స్ ఉంది. వాళ్ళ వివరాలు కూడా త్వరలోనే తెలియనున్నాయి. అలాగే మిగతా తారాగణం వివరాలు కూడా వెల్లడి కానున్నాయి. యూవీ క్రియేషన్స్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న విశ్వంభర కి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.