EntertainmentLatest News

ప్రభాస్ సలార్ కి రవితేజ కిక్ కి  ఉన్న లింక్ ఇదే..రవితేజ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్  


ప్రభాస్ రవితేజ ఇద్దరు కూడా తెలుగు సినిమా రంగంలో నేటికీ తిరుగులేని హీరోలుగా ఉన్నారు పైగా ఇద్దరిది ఒకే ఊరు కూడాను. కొన్ని రోజుల క్రితం సలార్ తో ప్రభాస్ సంచలనం సృష్టిస్తే ఇప్పుడు ఈగిల్ తో రవి తేజ బాక్స్ ఆఫీస్ వద్ద హంగామా సృష్టిస్తున్నాడు.తాజాగా సోషల్ మీడియాలో వీరిద్దరికి సంబంధించిన న్యూస్ ఒకటి ఆకర్షణీయంగా మారింది.  


రవితేజ హీరోగా 2009 లో వచ్చిన మూవీ కిక్. ఈ సినిమా అప్పట్లో చాలా పెద్ద విజయాన్నే సాధించింది. ఇప్పుడు ఈ మూవీ రీ రిలీజ్ కి సిద్ధం అవుతుంది. వచ్చే నెల  మార్చ్ 1 వ తేదీన ప్రేక్షకులకి రవితేజ మరోసారి కిక్ ని అందివ్వనున్నాడు.ఇక ఈ చిత్రానికి ప్రభాస్ సలార్ కి ఉన్న సంబంధం ఏంటంటే సలార్ ని నైజాం లో డిస్ట్రిబ్యూట్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ కిక్ ని రీ రిలీజ్ చెయ్యనున్నారు.ఆల్రెడీ చిత్ర నిర్మాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని నిర్మించుకుంటు వస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ లో కూడా తమ సత్తాని చాటుతుంది. కిక్ ని ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తారో అనే క్యూరియాసిటీ కూడా మాస్ మహారాజా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోను  ఉంది   


సురేందర్ రెడ్డి దర్శకత్వం లో వచ్చిన కిక్ లో రవితేజ సరసన ఇలియానా జత కట్టింది.మూవీ లో వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అయితే ఆడియన్స్ ని ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి.అలాగే రవితేజ,బ్రహ్మనందం ల మధ్య వచ్చే కామెడీకి కడుపుబ్బా నవ్వని ప్రేక్షకుడు లేడు. నేటికీ యు ట్యూబ్ లో ఆ కామెడీ సీన్స్  చూసే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అలాగే ఇతర పాత్రల్లో శ్యామ్, జయప్రకాశ్ రెడ్డి, వేణు మాధవ్, కోట శ్రీనివాసరావు,నళిని, షాయాజీ షిండే తదితరులు  నటించారు. థమన్  సంగీతంలో వచ్చిన పాటలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచి సినిమా రేంజ్ ని పెంచాయి. ఎవరి కోరికలు వాళ్ళు  తీర్చుకుంటే కిక్ ఏముంటుంది పక్కోడి కోరిక తీర్చితే కదా అసలైన  కిక్ వచ్చేది అనే పాయింట్ తో వచ్చిన కిక్ మూవీలో రవితేజ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.

 



Source link

Related posts

బిడ్డ విషయంలో ఫస్ట్ టైమ్ స్పందించిన అవినాష్

Oknews

Ram Charan about his transformation as a dad క్లీంకార తో రామ్ చరణ్ ఖుషి ఖుషి

Oknews

Brs Mlc Kasireddy Resigned Brs, May Be Join Congress

Oknews

Leave a Comment