Latest NewsTelangana

A police officer died in car rash driving in Hyderabad | Hyderabad News: హైదరాబాద్‌లో మరో ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసు


Hyderabad Crime News: హైదరాబాద్‌లో నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రజాభవన్‌కు సమీపంలో ఎమ్మెల్యే కుమారుడే ర్యాష్ డ్రైవింగ్‌  చేసి బుక్కయ్యాడు. ఇప్పుడు అలాంటి ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఓ పోలీసు అధికారి బలి అయ్యాడు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ వద్ద ర్యాష్ డ్రైవింగ్‌కు సీఐ బలి అయ్యాడు. చార్మినార్‌ పరిధిలో ఎక్సైజ్ సిఐగా పని చేస్తున్న సాదిక్ అలీ ఓ పని మీద ఎల్బీనగర్ వచ్చారు. ఆయన నడుపుతున్న టూ వీలర్‌ యూ టర్న్ తీస్తున్న టైంలో ఓ కారు ఢీ కొట్టింది. ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తూ వచ్చిన కారు సాదిక్ నడుపుతున్న బండిని ఢీ కొట్టింది. 

కారు ఢీ కొట్టడంతో ఎగిరి పడ్డారు. ఆయనతోపాటు ఉన్న మరో కానిస్టేబుల్ పరిస్థితి అదే. రక్తపు మడుగులో ఉన్న ఇద్దర్నీ స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాదిక్ మృతి చెందాడు. మరో కానిస్టేబుల్ చికిత్స పొందుతున్నాడు. 
ఈ ఘటనలో కారు డ్రైవర్‌దే తప్పని పోలీసులు నిర్దారించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడే వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. కారు వివరాలు పరిశీలంచిన అధికారులు అది వినుషా శెట్టి పేరుతో రిజిస్టర్ అయినట్టు గుర్తించారు. ఈ కారుపై ఇప్పటికే చాలా చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఓవర్‌ స్పీడ్, డేంజర్ డ్రైవింగ్‌ చేసినట్టు రికార్డులు చూస్తే అర్థమైంది. ఇప్పుడు ఆ వివరాలతో కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు 

మరిన్ని చూడండి



Source link

Related posts

దేవర డిజిటల్ హక్కులు రేటు చూస్తే షాకే !

Oknews

యూట్యూబర్‌ ప్రణీత్  హనుమంతుపై కూతురు కేసు వెనక్కి.. మరో కేసు ముందుకి  

Oknews

Nagababu Satires on YS Jagan Siddham సిద్ధంపై నాగబాబు సైలెంట్ సెటైర్లు

Oknews

Leave a Comment