సైఫ్ అలీఖాన్ కూతురు ప్రధాన పాత్ర వహించిన ‘ ఏ వతన్ మేరే వతన్ ‘ మూవీ రిలీజ్ కి సిద్ధమైంది. ఈ సినిమాని కరణ్ జోహార్ నిర్మించారు.
భారత స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంలో ఎంతోమంది తమ ప్రాణాలని అర్పించారు. వారిలో కొందరు డైరెక్ట్ గా ఉద్యమంలో పాల్గొంటే మరికొంతమంది ఆ ఉద్యమకారులలో స్పూర్తిని నింపి పరోక్షంగా పాల్గొన్నారు. అండర్ గ్రౌండ్ లో ఓ రేడియో స్టేషన్ ని ఏర్పాటు చేసి, ఉద్యమకారులలో స్పూర్తిని నింపిన ఓ మహిళ కథే ఈ ‘ ఏ వతన్ మేరే వతన్ ‘. కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాకి కణ్ణన్ అయ్యర్ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి రిలీజ్ అవ్వడానికి సిద్ధమైంది.
ఉషా మెహతా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘ ఏ వతన్ మేరే వతన్’. స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఎంతోమంది ఉద్యమకారులలో రేడియో ద్వారా స్పూర్తిని నింపిన వారిలో ఒకరి జీవిత కథ ఇది. అప్పడు జరిగిన ఎన్నో కన్నీటికథలని నేటి యువతరానికి అందించాలని ఈ సినిమా తీసామని మూవీ మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మూవీని ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా మార్చి 21 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్నట్టు కరణ్ జోహార్ తెలిపారు. ఇమ్రాన్ హష్మీ, సచిన్ ఖేడ్కర్, అభయ్ వర్మ, ఆనంద్ తివారీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.