బీజేపీ ఫ్లోర్ లీడర్ – ఏలేటి మహేశ్వర్ రెడ్డిడిప్యూటీ ఫ్లోర్ లీడర్లు – పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి.రామారావు పటేల్ – బీజేపీఎల్పీ కార్యదర్శి.పాల్వాయి హరీశ్ బాబు – చీఫ్ విప్, బీజేపీఎల్పీ.ధన్ పాల్ సత్యనారాయణ – బీజేపీఎల్పీ విప్.రాకేశ్ రెడ్డి – కార్యదర్శి.ఎన్నికలు పూర్తై రెండు నెలలు కావొస్తున్నప్పటికీ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరనే దానిపై స్పష్టత ఇవ్వకపోవటంతో అనేక విమర్శలు వినిపించాయి. సొంత పార్టీ నేతలు కూడా కొంత అసహనానికి గురయ్యారు. ఇటీవలే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఫ్లోర్ లీడర్ ప్రకటన ఆలస్యం పార్టీకి ఏమాత్రం మంచిది కాదన్నారు. ఎవరో ఒకరని ఫ్లోర్ లీడర్‌గా త్వరగా ఎంపిక చేస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. తనకు శాసనసభాపక్షనేత పదవిపై ఆసక్తి లేదని చెప్పుకొచ్చారు. జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయమని పార్టీ కోరుతోందని.. కానీ తనకు ఎంపీగా పోటీ చేసే ఆసక్తి లేదని చెప్పుకొచ్చారు రాజాసింగ్.
Source link