తన సినీ కెరీర్ మొదటి నుంచి హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటు వెళ్లే హీరో నాగ చైతన్య. ఎలాంటి అరుపులు మెరుపులు లేకుండా సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి మన పక్కింటి కుర్రోడులా అనిపించడం చై నటనకి ఉన్న స్టైల్.ఒక రకంగా చెప్పాలంటే అక్కినేని వారి నటనకి ఉన్న ఆనవాయితీ కూడా అదే. తాజాగా నాగ చైతన్య వాలంటైన్స్ డే సందర్భంగా ప్రముఖ నటి సాయి పల్లవి కి గిఫ్ట్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచాడు.
నాగ చైతన్య ,సాయి పల్లవి లు తండేల్ తో జత కడుతున్నారు. కొన్ని రోజుల క్రితం తండేల్ నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ అందరిని ఆకట్టుకుంది. అందులో చై పల్లవితో బుజ్జి తల్లి వచ్చేస్తున్నా కదే కాస్త నవ్వవే అని అంటాడు. ఇప్పుడు ప్రేమికుల రోజు సందర్భంగా చై సాయి పల్లవి కి ఇదే డైలాగ్ ని రీక్రియేట్ చేసి వాలెంటైన్స్ డే గిఫ్ట్ గా అందించాడు.చై చేసిన ఈ వీడియోలో సాయి పల్లవి కూడా క్యూట్ పెర్ఫార్మ్ ఇచ్చింది. ఇప్పుడు ఈ వీడియోని చై తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
అలాగే చై చెప్పిన ఆ డైలాగ్ తో మూవీలో చై మధ్య సాయి పల్లవి మధ్య ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉండబోతుందనే విషయం అందరికి అర్ధం అయ్యింది.అలాగే ఆ సీన్ పై చాలా మంది రీల్స్ కూడా చేస్తున్నారు. తండేల్ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణని జరుపుకుంటుంది. గీత ఆర్ట్స్ నిర్మాణ సారథ్యంలో తెరక్కుతున్న ఈ మూవీ మీద అక్కినేని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోను భారీ అంచనాలే ఉన్నాయి. కార్తికేయ 2 తో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించిన చందు మొండేటి దర్శకుడుగా వ్యవ్యహరిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.