Andhra Pradesh

నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుపడ్డారు, విభజన పరిస్థితులపై పుస్తకం రాస్తా- మంత్రి బొత్స-amaravati news in telugu minister botsa satyanarayana sensational comments on chiranjeevi cm post ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


పవర్ షేరింగ్ చిచ్చు

అయితే అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ…తనను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మన సామాజిక వర్గం వాళ్లే నన్ను సీఎం కాకుండా అడ్డుకున్నారనే అభిప్రాయంతో ఆయన మాట్లాడరని విశ్లేషకులు అంటున్నారు. దీంతో పాటు జనసేన, టీడీపీ మధ్య పొత్తు కుదిరినా…క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వీటిని తమకు అనుకూలంగా మార్చుకుని పొత్తు విచ్ఛిన్నం చేసేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుందన్న విమర్శలు లేకపోలేదు. చంద్రబాబు(Chandrababu) ఇద్దరు అభ్యర్థులను ప్రకటించడం, లోకేశ్ చంద్రబాబే సీఎం వ్యా్ఖ్యలపై పవన్ కల్యాణ్(Pawan Kalyan) బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ పొత్తు ధర్మం పాటించడంలేదని విమర్శించారు. రాజానగరం, రాజోలులో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. ఎప్పటి నుంచో సీఎం పదవి కోసం ఎదురుచూస్తున్న కాపు సామాజిక వర్గం నేతలు పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా చూస్తు్న్నారు. టీడీపీ, జనసేన కూటమి అధికారంలో వస్తే పవర్ షేరింగ్ కోసం పట్టుబట్టాలని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో బొత్స వ్యాఖ్యలు…జనసేన, టీడీపీకి మధ్య ఆజ్యం పోసినట్లు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.



Source link

Related posts

ఏపీ ఇంటర్ ఫలితాలపై అప్డేట్, ఏప్రిల్ రెండో వారంలో వచ్చే ఛాన్స్!-amaravati ap inter spot valuation completed by april 4th results expected on april second week ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP MPs In Delhi: పదవులు వదిలేసినా క్వార్టర్లు పదిలం.. అదే ఏపీ ఎంపీల లక్ష్యం… చర్చనీయాంశంగా ఎంపీల తీరు…

Oknews

వైసీపీకి సినీ నటుడు అలీ రాజీనామా- రాజకీయాలకు గుడ్ బై అంటూ వీడియో రిలీజ్-actor ali resigns to ysrcp released video says now onwards not related to any political party ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment