Health Care

టీ తాగడం వల్ల చర్మం నల్ల రంగులోకి మారే ఛాన్స్ ఉందా?


దిశ, వెబ్ డెస్క్: మనం రోజూ తినే ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకే ఆరోగ్యంగా ఉండటానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే ఆహారం విషయంలో ఎవరి టెస్ట్ వారికి ఉంటుంది. అయితే ఈ మధ్య చాలా మంది టీ తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతే కాదు కొన్ని సార్లు ఇంట్లో కర్రీస్ బాగోలేక పోయిన టీ పెట్టుకొని తాగుతారు. నిజానికి టీ అనేది ఆకలిని చంపేస్తుంది. ఈ టీని తాగడం తో తమ డే ని స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లు రోజు తాగుతూనే అయ్యో ఒక రోజులో ఎక్కువ గా టీ ని తాగుతున్నము మరి ఏమైనా అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది అని సందేహ పడతారు. ఈ రోజుల్లో చాలా మంది అందంగా ఉండడానికి తమకు ఎంతో ఇష్టమైన ఫుడ్ ని వదిలేసుకుంటున్నారు. ఏలాగంటే ఫ్యాట్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తింటే లావు అయిపోతాము అంటూ నెమ్మదిగా తమ అలవాట్లను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరికొందరు టీ ఎక్కువగా తాగితే శరీర రంగు మారిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం..

టీ తాగకపోతే తల నొప్పిగా ఉందంటూ రోజుకి నాలుగు సార్లు అయిన తాగుతున్నారు. ఒకసారి టీ కి అలవాటు అయితే మానడం కష్టమే. చాలా మంది దీనికి బానిసలయ్యారు అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ప్రపంచంలో రోజుకు నాలుగు సార్లు టీ తాగేవారు ఉన్నారని అధ్యయనంలో తేలింది.

రీసెంట్ గా కొందరు టీ అధికంగా తాగడం వల్ల చర్మం నల్ల రంగులోకి మారిపోతుందనే సందేహంలో ఉన్నారు. దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా..టీ తాగడం వల్ల చర్మం రంగు మారదని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్నో అధ్యయనాలు చేసిన టీ తాగితే చర్మం నల్లరంగులో మారిపోతుందానేది ఎక్కడ లేదని చెబుతున్నారు. అయితే టీ ఎక్కువగా తాగితే రంగు మారదు కానీ చర్మం మెరుపు తగ్గుతుందా నీ చెబుతున్నారు. కొందరైతే మెరుపు తగ్గడాన్ని రంగు తగ్గినట్లుగా భావిస్తారు. కానీ అది నిజం కాదు టీ తాగడం వల్ల రంగు మారదు.

టీ తాగితే చర్మం మెరుపు తగ్గుతుందా?

టీ లేదా కాఫీ లో కెఫిన్ అధికంగా ఉంటుంది. రోజుకు నాలుగు సార్లు టీ, కాఫీలు తాగడం వల్ల ఆ కెఫీన్ శరీరంలో చేరి ఏజింగ్ లక్షణాలను పెంచుతుంది. శరీరంలో కెఫిన్ వల్ల కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ క్రమంలో చర్మంపై ముడతలు పడడం, గీతలు రావడం, పాలిపోయినట్టు అవ్వడం జరుగుతుంది. దీంతో చర్మం రంగు తగ్గినట్టు కనిపిస్తుంది. ఎప్పుడైతే చర్మం తాజాగా ఉంటుందో అప్పుడు చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. టీ కాఫీల వల్ల ఆ మెరుపు పోతుంది. కావున టీ తాగితే చర్మం నల్లరంగులోకి మారిపోతుందనేది అపోహ అని అధ్యయనాలు చెబుతున్నాయి.



Source link

Related posts

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఈ వాస్తుచిట్కాలు పాటించి చూడండి!

Oknews

బిలియనీర్ల కామన్ హాబిట్స్.. సక్సెస్‌‌కు అవే కారణమా?

Oknews

40 ఏళ్లు దాటినా ఆ పని చేయకుండా ఉండలేకపోతున్నారా?.. అయితే ఇది మీకోసమే..

Oknews

Leave a Comment