ఫిబ్రవరిలోనే చెమటలు పట్టిస్తున్న భానుడుసాధారణంగా ఫిబ్రవరి చివరి వారంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. ఉక్కపోత మొదలవుతుంది. మార్చి నెల ప్రారంభం నుంచి ఎండల తీవ్రత పెరుగుతూ… ఏప్రిల్, మే నెల భానుడు ప్రతాపం చూపుతాడు. అయితే ఈఏడాది సూర్యుడు కాస్త ముందుగానే చెమటలు పట్టిస్తున్నాడు. తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లో పలు జిల్లాల్లో సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఉష్ణోగ్రతల పెరుగుదలలో ఇదే గరిష్ఠమని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఆదిలాబాద్‌లో 31.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా, గత వారంలో 36 డిగ్రీలుగా ఉష్టోగ్రతలు చేరాయి. ఖమ్మంలో సైతం 35 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. హైదరాబాద్‌లో కూడా ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్ లో సాధారణం కంటే 3.7 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి.
Source link
previous post