Health Care

డయాబెటీస్‌తో బాధపడే వారికి ఏ పాలు మంచివో తెలుసా?


దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా మంది డయాబెటీస్ బారిన పడుతున్నారు. చిన్న వారికి కూడా ఈ వ్యాధి రావడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పవచ్చు. ఇక టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడే వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ ఫైబర్, ప్రొటీన్ అధికంగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. అయితే వీరు పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఆవు పాలు, గేదె పాలల్లో ఏది బెటరో ఎవరికీ తెలియదు.దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పాలలో కేలరీలు, కొవ్వు పరిమాణాన్ని బట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు పాలను తీసుకోవాలంట.240 మిల్లీలీటర్ల ఆవు పాలలో దాదాపు 160 కేలరీలు, 7.76 గ్రాముల ప్రోటీన్, 12 గ్రాముల చక్కెర, 8 గ్రాముల కొవ్వు ఉంటాయి. ఆవుపాల కంటే గేదె పాలు చిక్కగా ఉంటాయి. గేదె పాలలో 100 శాతం ఎక్కువ కొవ్వు, 40 శాతం ఎక్కువ కేలరీలు ఉంటాయి.పాలలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. కానీ సున్నా కొవ్వు, కేవలం 80 కేలరీలు కలిగిన తక్కువ కొవ్వు పాలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తాగడానికి మంచివి. పుల్లని పెరుగు, పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల టైప్-2 డయాబెటిస్ రిస్క్ 11-17 శాతం తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది.



Source link

Related posts

ఇంట్లోనే ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఎంత ఫిట్‌గా ఉన్నారో తెలుసుకోవచ్చు…

Oknews

ఆరోగ్యాన్ని కాపాడుతూ.. ఆనందాన్ని పంచుతున్న గార్డెనింగ్.. మిలీనియల్స్‌పై ఆ ప్రభావం కూడా..

Oknews

కపుల్స్‌ విడిపోవడానికి ఆ వస్తువే కారణం.. తాజా పరిశోధనల్లో షాకింగ్ నిజాలు

Oknews

Leave a Comment