TS POLYCET 2024 Notification: తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘టీఎస్ పాలిసెట్-2024’ నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ విద్యార్హతతతో టెక్నికల్ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ని నిర్వహిస్తారు. పశుసంవర్ధక, మత్స్య, ఉద్యానవన, వ్యవసాయ, ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో చేరాలంటే ఇందులో అర్హత సాధించడం తప్పనిసరి. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 22 వరకు ఫైన్ లేకుండా, రూ.100 ఫైన్‌తో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్థులు ఫిబ్రవరి 15 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పాలిటెక్నిక్ కాలేజీల్లో నిర్వహిస్తున్న పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 17న పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి తెలిపింది. ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.250, ఇతరులకు రూ.500. పరీక్ష జరిగిన 12 రోజుల్లో ఫలితాలు వెల్లడి అవుతాయి.
పాలిసెట్ 2024 ద్వారా పివి.నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహించే పశుసంవర్థన – మత్స్య పరిశ్రమకు సంబంధించిన కోర్సులు, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం అందించే ఉద్యానవన డిప్లొమా కోర్సులు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా అందిస్తున్న వ్యవసాయ కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే పాలిటెక్నిక్ కాలేజీల్లో నిర్వహిస్తున్న కోర్సులకు ఈ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. మరిన్ని వివరాలకు పాలిటెక్నిక్ www.polycet.sbtet.telangana.gov.in లో అందుబాటులో ఉంటాయి.
మరిన్ని చూడండి