దిశ, ఫీచర్స్ : ఫిబ్రవరి రెండో వారంలో అంటే ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఎక్కడ చూసినా ప్రేమికులు సంబరాల్లో మునిగితేలుతుంటారు. అలాగే మూడో వారం అంటే ఫిబ్రవరి 15 నుండి యాంటీ-వాలెంటైన్ వీక్ జరుపుకుంటారు. వాలెంటైన్ వీక్ లో కిస్ డే, టెడ్డీ డే ఇలా చాలా ఉంటాయి. మరి యాంటీ-వాలెంటైన్ వీక్ లో ఏయే రోజులు ఉంటాయో చాలా మందికి తెలియదు. అలాగే ఈ వారాన్ని ఎందుకు జరుపుకుంటారో కూడా తెలియదు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్లాప్ డే
ఫిబ్రవరి 15 నుండి ప్రారంభమయ్యే యాంటీ – వాలెంటైన్ వీక్‌లో వచ్చే రోజులు చాలా సరదాగా ఉంటాయి. ఈ వారంలో మొదటి రోజు స్లాప్ డే. నిజానికి ఈ రోజును జోక్‌గా తీసుకుని ఫిబ్రవరి 15న చెంపదెబ్బ కొట్టే సంప్రదాయం ఉందని చెబుతారు.
కిక్ డే..
ఫిబ్రవరి 16 అంటే వాలెంటైన్ వ్యతిరేక వారం రెండో రోజు వారి జీవితాల్లో చేదును కలిగించిన వ్యక్తుల కోసం. ఈ రోజును కిక్ డేగా జరుపుకుంటారు. అంటే మీకు ప్రతికూలంగా ఉన్న వారిని మీ జీవితం నుండి తొలగించండి.
పెర్ఫ్యూమ్ డే..
ప్రజలు ఫిబ్రవరి 17న పెర్ఫ్యూమ్ డేని జరుపుకుంటారు. ఈ రోజును స్వీయ ప్రేమ కోసం మీకు మీరే ఒక పెర్ఫ్యూమ్‌ను బహుమతిగా ఇచ్చుకునే రోజు.
ఫ్లర్ట్ డే
ఫిబ్రవరి 18న వాలెంటైన్ వ్యతిరేక వారంలో నాల్గవ రోజు. ఈ రోజున ప్రజలు ఫ్లర్ట్ డేని జరుపుకుంటారు. వాస్తవానికి, ఈ రోజున మీరు ఎవరికైనా స్నేహ హస్తాన్ని చూపించవచ్చు. లేదా కొత్త భాగస్వామిని కోసం వెతకవచ్చు.
కన్ఫెషన్ డే
ప్రజలు ఫిబ్రవరి 19 న కన్ఫెషన్ డేని జరుపుకుంటారు. అంటే ఈ రోజున మీరు మీ సన్నిహితులు, భాగస్వామి ముందు మీ తప్పును అంగీకరించే రోజు.
మిస్సింగ్ డే
మిస్సింగ్ డే అంటే ఎవరో మిస్సింగ్ అని ఈ రోజు పేరు సూచిస్తుంది. సుదూర ప్రాంతాల్లో ఉన్న ప్రేమికులకు ఈ రోజు ప్రత్యేకమైనది. మీ భాగస్వామి మీకు దూరంగా ఉన్నప్పుడు మీరు అతనిని/ఆమెను మిస్ అయితే ఈ రోజున మీరు మీ భావాలను మీ భాగస్వామితో పంచుకోవచ్చు.
బ్రేకప్ డే
వాలెంటైన్స్ వీక్‌లోని చివరి రోజైన ప్రేమికుల రోజు రెండు హృదయాల కలయికతో ముగుస్తుంది. అదే విధంగా యాంటీ వాలెంటైన్స్ డే చివరి రోజు బ్రేకప్ డే. ఈ రోజున మీరు మీ జీవిత భాగస్వామితో విడిపోయే రోజు.