Telangana

Sangareddy District News : అమాన‌వీయం… పసికందును రాళ్లకుప్పల్లో పడేసిన తల్లి



Sangareddy district News: సంగారెడ్డి జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును ఓ తల్లి గోనె సంచిలో మూటకట్టి రాళ్లకుప్పల్లో పడేసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన ఓ మహిళకు పది సంవత్సరాల క్రితం వివాహమైంది. అయితే ఆమె భర్తతో విడిపోయి కొన్నేళ్లుగా తల్లితో ఉంటుంది. దీంతో బుధవారం తన ఇంట్లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పసికందును తీసుకొనివెళ్ళి శ్మశాన వాటిక పక్కనున్న రాళ్లకుప్పలో మూటకట్టి పడేసింది. అటుగా వెళ్తున్న స్థానికులకు శిశువు ఏడుపు వినబడడంతో చుట్టూ పరిశీలించారు. రాళ్లకుప్పల మధ్యలో ఉన్న పసికందును గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కొందరు స్థానిక మహిళలు,అంగన్వాడీ టీచర్,ఆశా వర్కర్లు,అధికారులు అక్కడికి చేరుకొని శిశువుని బయటకు తీసి స్థానిక ఆరోగ్య ఉపకేంద్రానికి తరలించి ప్రధమ చికిత్స చేయించారు. అనంతరం సంగారెడ్డి లోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు.



Source link

Related posts

Telangana News Yasangi Season Is The Same In Telangana Agriculture News | Yasangi Season: తెలంగాణలో యాసంగి సీజన్ యథాతథం

Oknews

Prajavani temporarily deferred in view of Lok Sabha polls 2024 | Telangana: రాష్ట్ర ప్రజలకు అలర్ట్

Oknews

BRS Leader Swamigoud Is Likely To Join Congress | Telangana Congress : కాంగ్రెస్‌లోకి స్వామిగౌడ్

Oknews

Leave a Comment