దిశ, ఫీచర్స్ : రెస్ట్ తీసుకోవడమంటే ఏమిటో అందరికీ తెలుసు. ఇది ఎందుకు అవసరమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇటీవల ‘ఎమోషనల్ రెస్ట్’ అవసరం గురించి కూడా నిపుణులు నొక్కి చెప్తున్నారు. ఇది లేకపోవడంవల్లే చాలా మంది జీవితంలో తీవ్రమైన ఒత్తిడిని, అనారోగ్యాన్ని ఎదుర్కొంటున్నట్లు పేర్కొంటున్నారు. నిజానికి ఆధునిక జీవితం యొక్క వేగం ఒత్తిడితో కూడుకున్నది. ఆ ఆ వేగాన్ని తగ్గించడానికి టైమ్ కేటాయించడం కష్టంగా మారుతోంది. ఫలితంగా చాలా మంది ‘బర్న్ అవుట్’ అవుతున్నారు. ఈ సందర్భంలోనే ఎమోషనల్ రెస్ట్ అవసరం.
‘గ్రైండ్ కల్చర్’ ఎఫెక్ట్
క్షణం తీరికలేని ఉరుకులు, పరుగుల జీవితాన్ని నిపుణులు ‘గ్రైండ్ కల్చర్’తో పోలుస్తున్నారు. జీవితంలో ఎదగాలంటే తప్పదు అంటుంటారు కానీ, తరచుగా బిజీ షెడ్యూల్‌తో కూడిన ఒత్తిడి ప్రమాదకరమనేది ప్రజలు అనుభవం ద్వారా గ్రహిస్తుంటారు. స్ట్రెస్‌తో కూడుకున్నవి మంచి పనులే అయినా, తగినంత నిద్ర, వ్యాయామం ఉన్నప్పటికీ మానసికంగా అలసిపోతారు. ఇలాంటప్పుడే ‘భావోద్వేగా విశ్రాంతి’ కావాలి. ముఖ్యంగా శారీరక, భావోద్వేగ, ఆధ్యాత్మిక, మానసిక, సృజనాత్మక, సామాజిక, ఇంద్రియ విశ్రాంతి వంటి వాటిలో ఏదో ఒక ఎమోషనల్ రెస్ట్ లేకపోతే జీవితంలో బ్యాలెన్స్‌గా ఉండటంలో ఇబ్బంది పడతారని నిపుణులు చెప్తున్నారు.
ఖాళీగా ఉండే వారికి..
చాలా కాలంగా ఎటువంటి పని, ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండేవారు కూడా ఒత్తిడిని అనుభవిస్తారు. మీ జీవితంలోని వివిధ ప్రాంతాల నుంచి దానిని కూడగట్టుకుంటారు. వాస్తవానికి స్ట్రెస్ అనేది ఏదో ఒక రూపంలో ప్రాసెస్ చేయబడాలి. కానీ అలా జరగకపోవడంవల్ల మానసికంగా అలసిపోయిన అనుభూతి కలుగుతుంది. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ స్టడీ ప్రకారం 32% మంది ప్రజలు ఈ విధమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.
జనరేషన్ గ్యాప్ కూడా..
మిలీనియల్స్, జన్‌జర్స్ (Gen Z) ప్రస్తుతం తమ బూమర్ ప్రత్యర్థుల కంటే ఎక్కువగా ఒత్తిడిని అనుభవిస్తున్నారని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే వారు నిజంగానే ఒత్తిడికి గురవుతున్నారా? లేకపోతే ఒత్తిడి నిర్వహణ గురించి తక్కువ అవగాహన కలిగి ఉంటున్నారా? అనేది కూడా ఇక్క ప్రామాణికంగా ఉంటుంది. దీంతోపాటు ఫైనాన్షియల్ స్ట్రెస్, నచ్చని ఉద్యోగంలో పని చేయడం, కుటుంబాన్ని పోషించడంలో ఇబ్బందులు, చదువుల్లో ఒత్తిడి వంటివి ఎమోషనల్ స్ట్రెస్‌కు దారితీస్తుంటాయి. ఇరిటేషన్, లాక్ ఆఫ్ మోటివేషన్, భయాందోళనలు మీలో గమనించినట్లయితే బహుశా భావోద్వేగ విశ్రాంతి అవసరం. మిమ్మల్ని మీరు రీఛార్జ్, రీ బూస్ట్ చేసుకోవడం ద్వారా అది సాధ్యమే.
వ్యాయామం, ప్రకృతి ఆస్వాదన
ఎమోషనల్ స్ట్రెస్‌ను ఎదుర్కోవడానికి, ఎమోషనల్ రెస్ట్ బెస్ట్ సొల్యూషన్. ఇందులో భాగంగా ప్రకృతిలో సమయం గడపడం, మీకు ఆనందాన్ని కలిగించే యాక్టివిటీస్‌లో పాల్గొనడం, మీకు ఇష్టమైన లేదా నమ్మకమైన వ్యక్తి నుంచి ఎమోషనల్ సపోర్ట్ కోరడం వంటివి ఉపయోగపడతాయి. దీంతోపాటు ఫిజికల్ యాక్టివిటీస్ అవసరం. ఇక వ్యాయామం అంటే జిమ్ సెషన్ మాత్రమే కానవసరం లేదు. ప్రకృతిని ఆస్వాదిస్తూ నడవడం, మీకు సంతోషం కలిగించే డ్యాన్స్, యోగా వంటి తరగతుల్లో పాల్గొనడం కూడా భావోద్వేగ విశ్రాంతికి దోహదపడతాయి.
మైండ్ ఫుల్‌నెస్
ఎమోషనల్ స్ట్రెస్ మేనేజ్ చేయడానికి మైండ్ ఫుల్‌నెస్ ప్రాక్టీసెస్ చాలా ముఖ్యం. అందుకోసం యోగా, ధ్యానం వంటివి యూజ్ అవుతాయి. గైడెడ్ మెడిటేషన్‌ని అనుసరించడానికి శీఘ్రంగా 15 నిమిషాల విరామం తీసుకోండి లేదా మౌనంగా కూర్చుని మీ అంతట మీరే ఒత్తిడి రహిత భావాలతో గడపండి. దీనివల్ల మీ ఆలోచనలు అదుపులో ఉంటాయి. శారీరక అలసట దూరం అవుతుంది. నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది.