దర్శక ధీరుడు రాజమౌళి తో పాటు ఎన్నో అద్భుతమైన సినిమాలని ప్రేక్షకులని అందించిన వ్యక్తి సెంథిల్ కుమార్. ఆయన ఫొటోగ్రఫీ లో ఒక సినిమా వస్తుందంటే ఇంక ఆ సినిమా టెక్నీకల్ గా అంతర్జాతీయ లెవల్లో పేరు ప్రఖ్యాతులని అవార్డుల్ని సంపాదించినట్టే అనే నానుడి కూడా మూవీ లవర్స్ లో ఉంది. తాజాగా జరిగిన ఒక సంఘటన సెంథిల్ ని విషాదవదనంలో ముంచెత్తింది.
సెంథిల్ కుమార్ భార్య పేరు రూహి. ఆమె ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ లో అకస్మాత్తుగా మరణించింది. దీంతో చిత్ర పరిశ్రమలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువులు సినీ ప్రేమికులు సెంథిల్ ఇంటికి వెళ్లి రూహి భౌతిక దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఆమె మరణానికి కారణాలు తెలియలేదు.రేపు ఉదయం ఫిలింనగర్ లో ఉన్న మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి.
2003 లో వచ్చిన ఐతే సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన సెంథిల్ ఆ తర్వాత ఛత్రపతి,అరుంధతి.ఈగ,సై, యమదొంగ, మగధీర, బాహుబలి పార్ట్ 1 అండ్ 2 ,ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ హిట్ మూవీస్ కి ఫొటోగ్రఫీ ని అందించాడు. కెమరామెన్ కి స్టార్ ఇమేజ్ తెచ్చిన వాళ్ళల్లో కూడా సెంథిల్ ఒకరు.ఈయన స్వస్థలం సికింద్రాబాద్